https://oktelugu.com/

Bachchala Malli Twitter Review: ‘బచ్చలమల్లి’ మూవీ ట్విట్టర్ రివ్యూస్..అల్లరి నరేష్ కి ఈసారైనా అదృష్టం కలిసొచ్చిందా?

ఇప్పటి ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా తనని తానూ మార్చుకొని, సెలెక్టివ్ కంటెంట్స్ చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అలా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ నుండి 'బచ్చల మల్లి' చిత్రం తెరకెక్కి నేడు గ్రాండ్ గా విడుదలైంది.

Written By: , Updated On : December 20, 2024 / 09:04 AM IST
Bachchala Malli Twitter Review

Bachchala Malli Twitter Review

Follow us on

Bachchala Malli Twitter Review: కామెడీ హీరో గా నేటి తరం ఆడియన్స్ ని అలరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరో అల్లరి నరేష్. మొన్నటి తరం లో కామెడీ హీరో గా రాజేంద్ర ప్రసాద్ ఎలాంటి సెన్సేషన్ సృష్టించాడో, నేటి తరంలో అల్లరి నరేష్ కూడా అలాంటి సెన్సేషన్ సృష్టించాడు. ముఖ్యంగా పేరడీ సినిమాలు అంటే మన అందరికీ గుర్తుకొచ్చేది అల్లరి నరేష్ మాత్రమే. ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆయన ఎక్కువగా అదే జానర్ సినిమాలు చేయడంతో ఆడియన్స్ కి బోర్ కొట్టింది. కొంతకాలం వరకు ఆయన సినిమాలను థియేటర్స్ లో చూడడం ఆపేసారు. దీంతో తన పొరపాట్లను తెలుసుకొని, ఇప్పటి ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా తనని తానూ మార్చుకొని, సెలెక్టివ్ కంటెంట్స్ చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అలా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ నుండి ‘బచ్చల మల్లి’ చిత్రం తెరకెక్కి నేడు గ్రాండ్ గా విడుదలైంది.

నిన్ననే ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు సెలెక్టివ్ థియేటర్స్ లో పైడ్ ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ సినిమాని చూసిన ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది..?, ఇప్పటికైనా అల్లరి నరేష్ కి అదృష్టం వరించిందా?, లేకపోతే సక్సెస్ కోసం ఇంకా ఎదురు చూపులు తప్పవా?..అసలు ట్విట్టర్ లో ఈ చిత్రం గురించి ఏమనుకుంటున్నారు వంటివి ఇప్పుడు మనం ఈ స్టోరీ లో చూడబోతున్నాము. ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ లో ఫస్ట్ హాఫ్ కి మంచి రివ్యూస్ ఇచ్చారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అనుకున్న స్థాయిలో లేదని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో గ్రామీణ నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కాయి. ఇదే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఆ ట్రెండ్ కి తగ్గట్టుగా మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాం అంటూ అల్లరి నరేష్ ఒక ప్రయత్నం చేసినట్టే అనిపించింది కానీ, అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదని అంటున్నారు.

ఇందులో హీరో అల్లరి నరేష్ ఒక మూర్కుడిలా కనిపిస్తాడు. వెనకా ముందు ఆలోచించకుండా తనకి ఏది అనిపిస్తే అది చేసుకుంటూ ముందుకు పోతుంటాడు. అయితే అలా వెళ్లడం వల్ల ఎదురయ్యే పరిణామాలను డైరెక్టర్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తియ్యలేకపోయాడని, ఎమోషన్స్ పెద్దగా పండలేదని, కానీ అల్లరి నరేష్ మాత్రం అద్భుతమైన నటన కనబర్చడాని, ఈ క్యారక్టర్ లో ఆయన జీవించిన తీరు అద్భుతమని కామెంట్స్ చేస్తున్నారు. అల్లరి నరేష్ ప్రయత్నాలు బాగానే ఉన్నాయి కానీ, డైరెక్టర్స్ ఆయన టాలెంట్ ని మ్యాచ్ చేసే కథలతో రావడం లేదని సోషల్ మీడియా లో విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఈ చిత్రాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే తప్పులు కనిపిస్తాయని, అలా కాకుండా కాసేపు టైంపాస్ చేద్దామని థియేటర్ కి వెళ్తే కచ్చితంగా ఈ చిత్రం అలరిస్తుందని మరికొంత మంది అంటున్నారు. ఓవరాల్ గా ట్విట్టర్ టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.