Highest Remuneration: సినీ ఇండస్ట్రీలో ఎందరో సింగర్స్ ఉన్నారు. వీరిలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిలో ఉన్నవారి వరకు ఉన్నారు. ఒక్కో సింగర్ ఒక్కో విధంగా రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇండస్ట్రీలో వారికి ఉన్న పాపులారిటీ బట్టి వీరికి రెమ్యునరేషన్లు ఉంటాయి. పాపులారిటీ ఉంటేనే రెమ్యునరేషన్ కూడా కోట్లలో ఉంటుంది. అయితే సినీ ఇండస్ట్రీలో ఎందరో సింగర్స్ ఉన్నారు. వీరిలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న గాయకుడు ఏ ఆర్ రెహమాన్. ఇతను ఒక్కో పాటుకు దాదాపుగా రూ.3 కోట్లు వరకు తీసుకుంటారట. ఏ ఆర్ రెహమాన్‌తో పాటు మన దేశంలో చాలా మంది టాప్ సింగర్లు ఉన్నారు.
అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్, సోను నిగమ్, దిల్జిత్ దోసాంజ్ ఇలా ఎందరో ఉన్నారు. కానీ వీరందరూ కనీసం రెహమాన్ తీసుకునే రెమ్యునరేషన్‌కి దరిదాపుల్లో కూడా లేరు. ఇతర సింగర్లుకు ఇచ్చే రెమ్యునరేషన్ కంటే 15 రెట్లు అధికంగా రెహమాన్‌కి ఇస్తారట. అంటే మిగతా సింగర్లు ఎంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారో అర్థం చేసుకోవచ్చు. చిన్నతనంలో ఎన్నో ఒడిదుడుకులతో ఇబ్బంది పడిన రెహమాన్ తన గానంతో ప్రపంచాన్ని మచ్చిక చేసుకున్నాడు. తన పాటలకు ఆస్కార్ కూడా వరించింది. శ్రేయా ఘోషల్ ఒక్కో పాటకు రూ. 40 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఆ తర్వాత సునిధి చౌహాన్ ఒక్కో పాటకు రూ. 20 లక్షలు, అర్జిత్ సింగ్ రూ.25 లక్షలు తీసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా రెహమాన్ తన భార్య సైరా విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. తమ 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్థి పలుకుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ పరస్పర అంగీకారంతోనే ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎంత ప్రేమ ఉన్నా కూడా కొన్ని సార్లు కలిసి ఉండటం కంటే విడిపోవడమే బెటర్ అని అందుకే విడిపోతున్నట్లు తెలిపారు. రెహమాన్‌కి 1995లో వివాహం జరిగింది. పెళ్లయిన ఇన్నేళ్లకు విడాకులు తీసుకుంటున్నారు.
తన వ్యక్తిగత విషయాలను రెహమాన్ ఎప్పుడు గోప్యంగానే ఉంచారు. అయితే గత కొన్ని రోజుల నుంచి రెహమాన్ తన కుటుంబ సభ్యులతో సమయం గడపడం లేదని ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయట. ఈ క్రమంలోనే తన భార్య విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబానికి సమయం ఇవ్వకుండా సినిమాలకు ఎక్కువగా సమయం కేటాయించడం వల్ల అతని భార్య సైరా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేవలం వీరి నిర్ణయమే కాకుండా తమ కుటుంబ సభ్యుల నిర్ణయంతో విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఈ విడాకులు తీసుకునే సెలబ్రిటీల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ఇప్పటికీ పలువురు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. వీరితో కొత్తగా పెళ్లయిన వారు, పెళ్లయి ఏళ్లు గడిచిన వారు కూడా ఉన్నారు.