తాజాగా, ఈ సినిమాలో బెల్లి లలిత కారెక్టర్ అయిన లతను నయీం లిప్ కిస్ చేసే దృశ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, ఈ సినిమా శుక్రవారమే విడుదలైనప్పటికీ.. ఈ సినిమాను నిలివేయాలంటూ సూర్యప్రకాశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ సినిమా దర్శకుడు, నిర్మాతలకు స్టే విధిస్తూ.. హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు నయీం డైరీ సినిమా ప్రదర్శన నిలిపేయాలంటూ హైకోర్టు స్టే విధించింది.
Also Read: ఆటోలో గమనం సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన శ్రియ
నయూం గ్యాంగ్‌స్టర్ గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నయీం.. ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఈ క్రమంలోనే గతంలో రామ్‌గోపాల్ వర్మ కూడా ఇతనిపై సినమా తీస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ తర్వాత మళ్లీ ఆర్జీవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.
Also Read: వరుణ్ తేజ్ అభిమానులకు షాక్… “గని” మూవీ రిలీజ్ వాయిదా