https://oktelugu.com/

Manchu Vishnu: కోలీవుడ్​లో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న మంచు విష్ణు

Manchu Vishnu: ప్రముఖ టాలీవుడ్​ హీరో మంచు విష్ణు ప్రస్తుతం ఢీ అంటే ఢీ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. గతంలో వచ్చిన ఢీ సినిమాకు సీక్వెల్​గా ఇది రూపొందుతోంది. దీంతో పాటు మోహన్​బాబు నటిస్తున్న సన్​ ఆఫ్ ఇండియా సినిమాను తానే స్వయంగా నిర్మిస్తున్నారు. 2020లోఆయన నటించిన మోసగాళ్లు, చదరంగం చిత్రాలు విడుదల కాగా.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. మరి ఢీ సినిమాతోనైనా హిట్ కొడతారేమో చూడాలి. మరోవైపు కురుళ్​ 388 సినమాతో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 05:28 PM IST
    Follow us on

    Manchu Vishnu: ప్రముఖ టాలీవుడ్​ హీరో మంచు విష్ణు ప్రస్తుతం ఢీ అంటే ఢీ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. గతంలో వచ్చిన ఢీ సినిమాకు సీక్వెల్​గా ఇది రూపొందుతోంది. దీంతో పాటు మోహన్​బాబు నటిస్తున్న సన్​ ఆఫ్ ఇండియా సినిమాను తానే స్వయంగా నిర్మిస్తున్నారు. 2020లోఆయన నటించిన మోసగాళ్లు, చదరంగం చిత్రాలు విడుదల కాగా.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. మరి ఢీ సినిమాతోనైనా హిట్ కొడతారేమో చూడాలి.

    Manchu Vishnu

    మరోవైపు కురుళ్​ 388 సినమాతో ఈ తెలుగు స్టార్​ కోలీవుడ్​లోనూ అడుగుపెట్టనున్నారు. మంచు విష్ణు హీరోగా కోలీవుడ్​కు పరిచయం కానున్న సినిమా కురుళ్​388. రామా రీల్స్ పతాకంపై జాన్​ సుధీర్​, కిరణ్​ ధనబాలా సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. ఇందులో సురభి హీరోయిన్​గా కనిపించనుండగా.. సంపత్​కుమార్​, నాజర్​, మీశ్​కాంత్​, రామదాస్​, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    Also Read: హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ సైనికుడు సాయితేజ కుటుంబానికి అండగా… మంచు విష్ణు

    జీఎస కార్తిక్​ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుందని నిర్మాతులు తెలిపారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.  కాగా, ఇటీవలే జరిగిన మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రకాశ్​రాజ్​ పోటీగా నలబడగా.. మంచు విష్ణు బంపర్ మెజారిటీతో గెలుపొందారు. ఈ క్రమంలోనే మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విషయం సర్దుమనిగినప్పటికీ.. లోపల మాత్రం ఇంకా లావాలా చెలరేగుతూనే ఉంది.

    Also Read: వరుణ్ తేజ్ అభిమానులకు షాక్… “గని” మూవీ రిలీజ్ వాయిదా