Homeఎంటర్టైన్మెంట్ETV Prabhakar Shocking Comments: అయ్యా సీరియల్ ప్రభాకరూ.. మీరు, మీ కొడుకు ఓ వర్గానికి...

ETV Prabhakar Shocking Comments: అయ్యా సీరియల్ ప్రభాకరూ.. మీరు, మీ కొడుకు ఓ వర్గానికి ఇన్స్పిరేషన్ అంతే!

ETV Prabhakar Shocking Comments: సినిమా రంగంలో పని చేసేవారు గొప్ప వ్యక్తులు కారు. వారు కూడా మనుషులే. దైవంశ సంభూతులుగా వారిని వారు అనుకుంటే చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే సినిమా రంగం అనేది ఒక అద్దాల ప్రపంచం లాంటిది. అందులో కనిపించేది ఒకటైతే.. కనిపించకుండా ఉండేది మరొకటి. సాధారణంగా కనిపించే దానినే ప్రజలు ఎక్కువగా గుర్తిస్తారు కాబట్టి.. సినిమా రంగంలో పని చేసే వారికి ఆ స్థాయిలో క్రేజీ ఉంటుంది. సినిమా రంగంలో పని […]

ETV Prabhakar Shocking Comments: సినిమా రంగంలో పని చేసేవారు గొప్ప వ్యక్తులు కారు. వారు కూడా మనుషులే. దైవంశ సంభూతులుగా వారిని వారు అనుకుంటే చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే సినిమా రంగం అనేది ఒక అద్దాల ప్రపంచం లాంటిది. అందులో కనిపించేది ఒకటైతే.. కనిపించకుండా ఉండేది మరొకటి. సాధారణంగా కనిపించే దానినే ప్రజలు ఎక్కువగా గుర్తిస్తారు కాబట్టి.. సినిమా రంగంలో పని చేసే వారికి ఆ స్థాయిలో క్రేజీ ఉంటుంది.

సినిమా రంగంలో పని చేసేవారు తమ వారసులను అందులోకి తీసుకురావడం కొత్త విధానం కాదు. గతంలో అనేకమంది ఇదే పని చేశారు. ఇప్పుడు కూడా చాలామంది అదే పని చేస్తున్నారు. సినిమాలలో నటించేవారు తమ వారసులను సినిమా రంగానికి పరిచయం చేశారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు.

సీరియల్స్ లో నటించేవారు తమ వారసులను ఇప్పుడు సినిమా రంగానికి పరిచయం చేస్తున్నారు. వారిలో ప్రభాకర్ ఒకడు. గతంలో ఈయన ఈటీవీలో పనిచేసేవాడు. అందువల్లే ఆయనకు ఈటీవీ ప్రభాకర్ అనే పేరు వచ్చింది. అనేక సీరియల్స్ లో ప్రభాకర్ నటించాడు. ఇతడి కుమారుడి పేరు చంద్రహాస్. అతడు సీరియల్స్ వైపు వెళ్లిపోలేదు. చంద్రహాస్ ను సినిమా రంగానికి పరిచయం చేశాడు ఈటీవీ ప్రభాకర్.

చంద్రహాస్ నటించిన తొలి సినిమా రాంనగర్ బన్నీ అంతగా ఆకట్టుకోలేదు. అయితే నటన కంటే యాటిట్యూడ్ తోనే చంద్రహాస్ ఫేమస్. ఇటీవల గుంజిగుంజి అని ఓ పాట పాడి అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిగా మారిపోయాడు చంద్రహాస్.

ఇటీవల చంద్రహాస్ నటించిన బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాకు సంబంధించి ఒక పాటను పాడాడు చంద్రహాస్. అందులో గుంజు గుంజి అని ద్వంద్వార్థంతో కూడిన పాటను పాడాడు. ఇది కాస్త విపరీతమైన ట్రోల్ కు గురైంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కు సంబంధించి చంద్రహాస్.. ప్రభాకర్ పాల్గొన్నారు.

అందులో ఓ యూట్యూబ్ ఛానల్ కు చంద్రహాస్, ప్రభాకర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రభాకర్ తన కుమారుడి గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. చంద్రహాస్ కల్లు కుండలో మజ్జిగ తాగుతారట. ఓయో రూంలో హోమాలు చేస్తాడట. నిత్యాగ్ని హోత్రాలు నిర్వహిస్తాడట. టూత్ పౌడర్ లో ఏదో పౌడర్ కలుపుతారట. కింగ్ గోల్డ్ ఫ్లేక్ లో ఇంకా ఏదో పదార్థాన్ని యాడ్ చేస్తారట. ఓ తరహా బెలూన్లలో గాలి కూడా ఊదుతాడట.. అంతేకాదు మందు బాటిల్ లో నీళ్లు తాగడం చంద్రహాస్ కు చాలా ఇష్టమని ప్రభాకర్ గొప్పగా చెప్పుకున్నాడు. ప్రభాకర్ ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడాడో.. అప్పటినుంచి సోషల్ మీడియాలో అతడి గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. మీ కొడుకు ఏం చేస్తే మాకెందుకు.. ఎలా ఉంటే మాకెందుకు.. ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి కచ్చితంగా అది మీ పెంపకం గొప్పతనమే అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper