Hey Balwanth movie OTT release: సుహాస్(Actor Suhas) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హే బల్వంత్'(Hey Balwanth) నిన్న భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కొంతమందికి ఈ సినిమా మొత్తం బాగా నచ్చింది, కానీ కొంతమందికి మాత్రం కేవలం ఫస్ట్ హాఫ్ మాత్రమే నచ్చింది. సెకండ్ హాఫ్ పెద్దగా లేదంటూ కామెంట్స్ చేశారు. కానీ ఓవరాల్ గా సినిమా బాగుంది అనే టాక్ బయటకు రావడం తో ఈ చిత్రానికి మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున మూడు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, కోటి 50 లక్షలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ సినిమా టీం మొత్తం చేసిన పబ్లిసిటీ కూడా ఈ చిత్రం ఓపెనింగ్స్ కి బాగా కలిసొచ్చింది. ఇక రెండవ రోజు కూడా నూన్ షోస్ నుండే ఈ చిత్రం చాలా డీసెంట్ గా మొదలైంది.
ప్రస్తుతానికి బుక్ మై షో యాప్ లో గంటకు 1300 టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. సాయంత్రం సమయానికి కచ్చితంగా రెండు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ‘జీ5’ సంస్థ మంచి ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసిందట. వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పదం ప్రకారం ఈ సినిమాని థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో విడుదల చెయ్యాలి. అంటే ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని మార్చి 19న, అనగా ఉగాది కానుకగా విడుదల చేయబోతున్నారు అన్నమాట. ఓటీటీ ఆడియన్స్ అప్పటి వరకు ఎదురు చూస్తుండాల్సిందే. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచవ్యాపరంగా 7 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రెండు రోజుల్లోనే మూడు కోట్ల షేర్ వసూళ్లను రాబట్టే ట్రెండ్ ని చూస్తుంటే ఈ చిత్రానికి వీకెండ్ కి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే లాగా కనిపిస్తోంది. ఇక మిగిలిన కలెక్షన్స్ మొదటి వారం పూర్తి అయ్యేలోపు రాబట్టే అవకాశం ఉందని, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నమోదైన ఏకైక సూపర్ హిట్ చిత్రం గా నిలుస్తుందని అంటున్నారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సుహాస్ కి ఈ చిత్రం అతని ఫిల్మోగ్రఫీ లో మరో సూపర్ హిట్ గా చేరింది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.