NTR: సినిమా ఇండస్ట్రీలో నటీనటులు కలిసి యాక్ట్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ చిగురించడం సహజం…ఇక ఆ ఫ్రెండ్ షిప్ లో ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకుంటే మాత్రం వాళ్ళ మధ్య ప్రేమ కూడా పుడుతోంది. ఇక నటులుగా వాళ్ళ కెరియర్ ని మొదలుపెట్టి ఫ్రెండ్స్ గా మారి, ఆ తరువాత పెళ్ళి చేసుకొని ఒకటైన స్టార్ కపుల్స్ చాలామంది ఉన్నారు… కొంతమంది మాత్రం పెళ్లి దాకా వచ్చి విడిపోయిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా వరుస సినిమాలను చేస్తున్నాడు. తను చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో గజాల హీరోయిన్ గా చేసింది. ఆ సమయంలో తను ఎన్టీఆర్ ని ప్రేమించింది అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్లో తర్వాత మరో సినిమా రాలేదు… ఈ సినిమా తర్వాత ఆయన వరుస సక్సెస్ లను సాధిస్తూ టాప్ హీరో రేంజ్ కు వెళ్లిపోయాడు.
ఆ తర్వాత అతనితో వరుసగా నరసింహుడు,అశోక్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన సమీరారెడ్డి సైతం ఎన్టీఆర్ ని గాఢంగా ప్రేమిస్తోంది. తొందరలోనే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలైతే అప్పట్లో హల్చల్ చేశాయి…అది కూడా కార్య రూపం దాల్చలేదు.
మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ని ఇద్దరు హీరోయిన్లు గాఢంగా ప్రేమించారంటూ ఇప్పటికి తన అభిమానులు చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. మొత్తానికైతే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు… ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తున్నాడు.
ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మరోసారి పెను ప్రభజనాన్ని సృష్టించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు…ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాలతో ఎంత గొప్ప ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడు. తద్వారా పాన్ ఇండియాలో నెంబర్ వన్ స్టార్ హీరోగా ఎదుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…