YCP vs TDP: ఏ ప్రభుత్వం కానీ చేసింది చెప్పుకోవాలి. అలాగని అతిగా చెప్పుకోకూడదు. అయితే తాజాగా టిడిపి కూటమి ప్రభుత్వం ఈ విషయంలో వినూత్నంగా ముందుకు వెళ్తోంది. తాము ఏం చేస్తోంది అనే దానిపై ఎప్పటికప్పుడు స్పష్టతనిస్తోంది. 2024 జూన్ లో అధికారంలోకి వచ్చింది టిడిపి కూటమి. అయితే ఎటువంటి హడావిడి లేకుండా పాలన సాగిస్తోంది. నియోజకవర్గాల్లో ప్రజలకు ఇబ్బంది పెట్టేలా ఏ కార్యక్రమాలు జరపడం లేదు. చంద్రబాబు జిల్లాల పర్యటనలకు జనాలను పెద్దగా సమీకరించడం లేదు. కానీ ప్రభుత్వం తరఫున ఏ పని అయినా శ్రీకారం చుట్టినప్పుడు మాత్రం విధిగా ఒక జిల్లాకు వెళ్తున్నారు చంద్రబాబు. అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ గ్రామానికి వెళ్తున్నారు అదే గ్రామస్తులతో మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇది ఎవరికి ఇబ్బంది కలిగించని అంశం. అప్పట్లో జగన్ సీఎం గా జిల్లాలకు వస్తే ఆ హడావిడి వేరేలా ఉండేది. కానీ చంద్రబాబు ఇలా వచ్చి వెళ్తున్నారే తప్ప పక్క మండలాల ప్రజలకు కూడా తెలియడం లేదు.
అప్పట్లో ఉపాధ్యాయ నియామక పత్రాలు..
అయితే చేసింది చెప్పుకునేందుకు మాత్రం టిడిపి( Telugu Desam Party) గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఫైల్ గా 16,345 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని సంతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ హామీని ఏడాది తిరగకముందే అమలు చేశారు చంద్రబాబు. ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా భర్తీని పూర్తి చేయగలిగారు. 16 వేల మందికి పైగా అభ్యర్థులను ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. వారిని అమరావతికి పిలిచి నియామక పత్రాలు అందించారు. అయితే ఎంపికైన వారితో పాటు ఉపాధ్యాయ వర్గాల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేసేలా ఆ పనిని చేశారు. ఇప్పుడు కూడా పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి పత్రాలు ఈరోజు అందించనున్నారు. ఉపాధ్యాయ నియామకాల మాదిరిగానే అమరావతిలో దానిని ఒక ఈవెంట్ల నిర్వహిస్తున్నారు.
కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. అప్పుడెప్పుడో 6000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ప్రాథమిక పరీక్ష నిర్వహించి దానిని అలానే విడిచిపెట్టారు. అయితే ఇది కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక మైనస్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. 6100 మందికి కానిస్టేబుల్ గా ఎంపిక చేసింది. వారికి ఈరోజు అమరావతిలో నియామక పత్రాలను అందజేయనుంది. అయితే వైసీపీకి టిడిపి కూటమికి అదే తేడా. 108 వాహనాలను, రేషన్ వాహనాలను ప్రారంభించే క్రమంలో భారీ ఈవెంట్ నిర్వహించారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఒకే దగ్గరకు పిలిచి అదో ఈవెంట్ల నిర్వహిస్తోంది. అయితే అప్పట్లో దుబారా అనేది కనిపించేది. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని స్పష్టమవుతోంది.