Samantha: ఇక టాలీవుడ్ కి సమంత పూర్తిగా దూరం కానుందా !!

అసలు విషయానికి వస్తే తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ తో సినిమా చేస్తున్నాడు.ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ తెరకెక్కించనున్నాడు.

Written By: Swathi, Updated On : September 21, 2023 8:58 am

samantha

Follow us on

Samantha: సమంత ఎన్నో ఆశలు పెట్టుకున్న శాకుంతలం సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ మధ్య వచ్చిన ఖుషి .. యూఎస్ లో కలెక్షన్స్ పరంగా దూసుకుపోగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నిరాశన మిగిల్చింది. ఈ నేపథ్యంలో సమంత టాలీవుడ్ కి పూర్తిగా దూరం కానుంది అనే వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది.

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలోని తెలుగు సినిమా ప్రేక్షకుల నుంచి సమంత పైన ఎన్నో ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాగచైతన్య ఫ్యాన్స్ సమంతని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు సినిమాల్లో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్న.. ఎక్స్పోజింగ్ ఉన్న.. తెలుగు ప్రేక్షకుల నుంచి సమంత కి ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం సమంత తెలుగు హీరో నాగచైతన్య ని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడమే.

కాగా ఇక తెలుగులో ఏమి చేసినా తప్పుగానే తీసుకుంటారు అని అనుకొనిందో ఏమో తెలియదు కానీ సమంత మాత్రం ప్రస్తుతం తెలుగు కన్నా హిందీ పైన శ్రద్ధ చూపిస్తా ఉంది అని తెలుస్తోంది.

మొన్నటివరకు వరసగా తెలుగు సినిమాలు చేస్తూ వస్తున్న సమంత ప్రస్తుతం ఖుషి తరువాత ఏ తెలుగు సినిమా ఒప్పుకోలేదు.‌ ఈ నేపథ్యంలో సమంత ఒక హిందీ సినిమా ఒప్పుకుంది అని.. సమంత తెలుగు ఇండస్ట్రీ నుంచి పూర్తిగా దూరమై బాలీవుడ్ కి వెళ్ళిపోవాలని అనుకుంటుంది అని ప్రచారం జరుగుతోంది.

అసలు విషయానికి వస్తే తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ తో సినిమా చేస్తున్నాడు.ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ తెరకెక్కించనున్నాడు. ఇక మేకర్స్‌ ఈ చిత్రంలో ఫీమేల్‌ లీడ్ రోల్‌ కోసం సమంతను ఫైనల్ చేశారని తాజా సమాచారం. నవంబర్ లేదా డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. తొలిసారి సల్మాన్‌ఖాన్‌, సమంత కాంబోలో సినిమా వస్తుందని తెలియడంతో ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నారు మూవీ లవర్స్‌.

అంతేకాదు సమంత ఇటీవలే బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్‌తో కలిసి నటిస్తున్న సిటడెల్‌ వెబ్ సిరీస్‌ను పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రీమియర్ కానుంది.

ఇక తెలుగులో ఫ్లాపులు.. అలానే సోషల్ మీడియాలో తెలుగువారి నుంచి సమంత పైన ట్రోల్స్ వస్తూ ఉండటంతో ..సమంత తెలుగులో సినిమాలు ఆపి పూర్తిగా హిందీ వైపు వెళ్ళాలి అని నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజంగానే సల్మాన్ తో ఆఫర్ వస్తే ఈమెకు మరిన్ని అవకాశాలు అందుకుని అక్కడే సెటిల్ అయిపోయే అవకాశం కూడా ఉంది. మరి సమంత నిజంగానే ఆ పని చేస్తుందో.. లేదా తనకు సూపర్ హిట్లు ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి దూరం కాకుండా ఉంటుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.