Heroine : చివరిసారిగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన డబుల్ ఇస్స్మార్ట్ శంకర్ ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పొందింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమాతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమా స్టైల్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. యూత్ ను ఎలా ఆకట్టుకోవాలో దర్శకుడు పూరి జగన్నాథకు బాగా తెలుసు. అందుకే ఆయన తీసిన సినిమాలన్నీ కూడా యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పూరి జగన్నాథ్ ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అనవసరం కానీ డైరెక్టర్ పూరి అయితే మాత్రం చాలు. యూత్ ను ఆకట్టుకునే వైవిద్యమైన కథలతో, డైలాగులతో పూరి జగన్నాథ్ సినిమాలు చేసి ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈయన సినిమాలలోనే హీరోలా ఆటిట్యూడ్ యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ కూడా ఏదో ఒకచోట పూరి మార్క్ డైలాగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే గత కొంతకాలం నుంచి పూరి జగన్నాథ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయి. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా అలాగే చివరిగా రామ్ పోతినేని తో చేసిన డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
Also Read : ఓదెల 2′ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత రావాలంటే!
ఈ సినిమాలో ఒకప్పటి సీనియర్ హీరోయిన్ టబు కూడా నటిస్తుంది అని సామాజిక మాధ్యమాలలో కొన్ని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు దర్శకుడు పూరి జగన్నాథ్ తో వరుసగా మూడు సినిమాలు చేసిన హీరోయిన్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఈ హీరోయిన్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో మూడు సినిమాలు చేస్తే అందులో ఒకటి ఇండస్ట్రీ హిట్, రెండో సినిమా హిట్ అలాగే మూడో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కెరియర్ లో ఇప్పటివరకు బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన సినిమా ఇడియట్.
ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైన ముద్దుగుమ్మ రక్షిత. హీరోయిన్ రక్షిత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇడియట్ సినిమాలో ఈమె అందానికి, నటనకు కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత రక్షిత పూరి జగన్నాథం దర్శకత్వంలో హీరో నాగార్జున నటించిన శివమణి సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాలో రక్షిత సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా సినిమాలో రక్షిత హీరోయిన్గా నటించింది. చివరిగా రక్షిత అదిరిందయ్యా చంద్రం అనే సినిమాలో నటించింది.
View this post on Instagram