Tollywood Heroine : కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ తండ్రి ఒక స్టార్ హీరో ఆమె తల్లి కూడా స్టార్ హీరోయిన్. కానీ ఈమెకు మాత్రం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో హిట్టు రావడం లేదు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటవారసులు ఉన్నారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చి హీరోలుగా అలాగే హీరోయిన్స్ గా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న వాళ్లు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కానీ కొంతమందికి మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో హిట్ పడడం లేదు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఒకరు. స్టార్ కిడ్ గా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ వరుస అవకాశాలను అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోతుంది. నటనపరంగా అందరి నుంచి ప్రశంసలు అందుకున్న కూడా సక్సెస్ కాలేక పోతుంది. సినిమా ఇండస్ట్రీలో నటవారసులుగా ఎంట్రీ ఇచ్చి తమకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకొని చాలామంది స్టార్స్ గా ఎదిగారు. ఇలా నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శివాత్మిక రాజశేఖర్. శివాత్మిక టాలీవుడ్ స్టార్ హీరో రాజశేఖర్, జీవిత కూతురు. దొరసాని సినిమాతో ఈమె టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే నటనపరంగా హీరోయిన్గా మంచి ప్రశంసలు అందుకుంది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
Also Read : అలా అవమానించడంతో ఆరు నెలలు నా ముఖం నేను అద్దంలో చూసుకోలేదు.. స్టార్ నటి ఎమోషనల్.
ఆ తర్వాత తమిళ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తమిళ్లో శివాత్మిక ఆనందం విలయదుం వీడు, నితం ఓరు వానం సినిమాలలో నటించింది. ఆ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. తెలుగులో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన పంచతంత్రం అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగ మార్తాండ వంటి సినిమాలలో నటించింది. కానీ ఈ సినిమాలు కూడా శివాత్మికకు సాలిడ్ హీట్ అందించలేకపోయాయి. ప్రస్తుతం శివాత్మిక కొత్త సినిమాల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తుంది. వరుసగా సినిమాలు ఒప్పుకోకుండా చిన్న గ్యాప్ ఇస్తుంది. ఈమె సినిమా కోసం ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ శివాత్మిక తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే రాజశేఖర్, జీవిత దంపతుల మరో ముద్దుల కూతురు శివాని రాజశేఖర్ కూడా అందం, నటన పరంగా మంచి ప్రశంసలు అందుకున్న సాలిడ్ హీట్ మాత్రం ఇప్పటివరకు అందుకోలేక పోతుంది. ఈ బ్యూటీ కూడా సామాజిక మాధ్యమాల లో తన అందాలతో రచ్చ చేస్తుంది. రాజశేఖర్, జీవిత దంపతుల ఇద్దరు కూతుర్లు మంచి హిట్స్ తో దూసుకుపోవాలని తెలుగు హీరోయిన్స్ గా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
View this post on Instagram