https://oktelugu.com/

Tamannaah On Baahubali: బాహుబలి విషయంలో ప్రభాస్, రానా అన్యాయం చేశారు… ఇన్నేళ్లకు బయటపడ్డ తమన్నా!

తమన్నా కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇక బాహుబలి 2లో హీరోయిన్ పోర్షన్ అంతా అనుష్కదే. తమన్నాకు అసలు స్క్రీన్ స్పేస్ లేదు.

Written By:
  • Shiva
  • , Updated On : June 15, 2023 / 07:55 AM IST

    Tamannaah On Baahubali

    Follow us on

    Tamannaah On Baahubali: హీరోయిన్ తమన్నా బాహుబలి నటులు ప్రభాస్, రానాల మీద తన అసహనం బయటపెట్టారు. క్రెడిట్ మొత్తం వాళ్ళు కొట్టేశారని తనలోని వేదన బయట పెట్టింది. బాహుబలి 1 విడుదలై ఏడేళ్లు అవుతుండగా ఇప్పుడు తమన్నా తనకు అన్యాయం జరిగిందన్నట్లు మాట్లాడింది. రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి 2015లో విడుదలై భారీ విజయం సాధించింది. ఐదు భాషల్లో రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పార్ట్ 1లో తమన్నా కీలక పాత్ర చేశారు. అనుష్కకు పెద్దగా పాత్ర నిడివి ఉండదు. ప్రభాస్ తో రొమాన్స్, సాంగ్స్ తమన్నా పాత్రకు ఉంటాయి.

    ఆ చిత్రం కోసం తమన్నా చాలా కష్టపడ్డారట. శ్రమకు తగిన గుర్తింపు రాలేదని తమన్నా అంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… యాక్షన్ చిత్రాల్లో హీరోలకు మాత్రమే పేరు వస్తుంది. బాహుబలి సినిమా క్రెడిట్ అంతా ప్రభాస్, రానాలకు దక్కింది. నాకు ఎలాంటి గుర్తింపు రాలేదు. కేవలం నాది గెస్ట్ రోల్ అన్నట్లుగా తీసేశారు. రానా, ప్రభాస్ కష్టపడ్డారు, వాళ్లకు క్రెడిట్ దక్కడంలో తప్పులేదు. అయితే నేను కూడా చెమటోడ్చాను, నాకు ప్రయోజనం దక్కలేదని ఆమె చెప్పుకొచ్చారు.

    తమన్నా కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇక బాహుబలి 2లో హీరోయిన్ పోర్షన్ అంతా అనుష్కదే. తమన్నాకు అసలు స్క్రీన్ స్పేస్ లేదు. క్లైమాక్స్ ఫైట్ లో ఆమె కనిపిస్తారు. చెప్పాలంటే బాహుబలి సిరీస్ క్రెడిట్ సింహభాగం రాజమౌళికి దక్కింది. తర్వాతే ప్రభాస్, రానా. బాహుబలి హీరోగా ప్రభాస్ ఇండియా వైడ్ మార్కెట్ సంపాదించారు. అది ఆయనకు ప్లస్ అయ్యింది. ఇప్పుడు సినిమాకు రూ. 100 నుండి 500 కోట్లు తీసుకుంటున్నాడు.

    కాగా తమన్నా ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 2లో నటించారు. జూన్ 29 నుండి నెట్ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమ్ కానుంది. మృణాల్ ఠాకూర్, కాజోల్ సైతం ఈ యాంతాలాజి సిరీస్లో భాగమయ్యారు. లస్ట్ స్టోరీస్ 2లో నటించిన విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్లు తమన్నా అంగీకరించారు. కొన్నాళ్లుగా వీరి ఎఫైర్ పై వార్తలు వస్తుండగా తమన్నా స్పష్టత ఇచ్చారు. అవును నిజమే అంటూ కుండబద్దలు కొట్టారు. లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్లోనే ఇద్దరి మనసులు కలిశాయట.