Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు కార్యకర్తలు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వారాహి యాత్ర నేడు ప్రారంభం అయ్యింది. కత్తిపూడి జంక్షన్ లో వారాహి వాహనం మీద పవన్ కళ్యాణ్ నిల్చొని ప్రసంగం ఇస్తుంటే, అక్కడకి వచ్చిన వేలాది మంది కేరింతలు కొడుతూ, పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ఆస్వాదించారు. అన్నవరం నుండి కత్తిపూడి కి వెళ్లేంత వరకు మార్గమధ్యం లో అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ పవన్ కళ్యాణ్ ని స్వాగతించారు. ఇక ఆయన ఇచ్చిన ఈ ప్రసంగం లో ముఖ్యమైన హైలైట్స్ నేడు ఈ స్టోరీ లో మీకోసం అందిస్తున్నాము చూడండి.
–> అభిమానులను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్ :
సినీ రంగం లోను , రాజకీయ రంగం లోను నన్ను నమ్మి జయాపజయాలకు అతీతంగా నాపై కురిపిస్తున్న ఆదరాభిమానాలకు చేతులెత్తి దండం పెడుతున్నాను. కర్ణుడు కవచ కుండరాలతో పుడితే, నేను మీ అభిమానం తో పుట్టాను అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
–> ముఖ్యమంత్రి ఆరోజు నాకు ఫోన్స్ చేసినప్పుడు నేను చెప్పింది ఒక్కటే : పవన్ కళ్యాణ్
2019 ఎన్నికలలో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించారు.నేను ఎంతో సహృదయం తో మనస్ఫూర్తిగా ఆయనకీ శుభాకాంక్షలు తెలియచేసి, చాలా బాధ్యతాయుత విపక్ష నేతగా నేను వ్యవహరిస్తాను.మీపై ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చెయ్యను కానీ, పాలసీ పరంగా మాత్రం జనం తరుపున నేను గొంతు ఎత్తుతాను , మాకు ఆ అవకాశం ఇవ్వకుండా పరిపాలించండి అని ముఖ్యమంత్రిని కోరాను. ఎప్పుడైతే నేను భావన నిర్మాణ కార్మికుల కోసం పోరాటం మొదలు పెట్టానో, అప్పటి నుండి నన్ను ఇష్టమొచ్చినట్టు తిట్టడం ప్రారంభించారు. చివరికి మా ఇంట్లోని చిన్న పాప మీద కూడా నీచమైన కామెంట్లు చేయించాడు అంటూ పవన్ కళ్యాణ్ జగన్ పై ఆరోపించాడు.
–> మద్యాన్ని ఉపయోగించుకొని వేల కోట్ల ఆదాయం : పవన్ కళ్యాణ్
అధికారం లోకి వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం విదిస్తాను అని చెప్పి, నేడు అదే మద్యం తో వ్యాపారం చేస్తూ వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. అధికారం లోకి వచ్చిన తర్వాత CPS రద్దు చేస్తాను అని చెప్పాడు, విద్యుత్తు చార్జీలు తగ్గిస్తాను అన్నాడు ఒక్కటైనా చేశాడా అంటూ పవన్ కళ్యాణ్ నిలదీసాడు .
–> ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుంది : పవన్ కళ్యాణ్
ఆరోజు అసెంబ్లీ లో తెలుగు దేశం ప్రభుత్వం రైతుల నుండి వేల ఎకరాలు తీసుకుంటుంటే , అది కూడా సరిపోదు ఇంకా కావాలి అని ప్రతిపక్ష హోదాలో కూర్చొని మద్దతు తెలిపిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. నేను అప్పుడే చెప్పాను అన్ని వేల ఎకరాలు ఎందుకు , చిన్నగా ప్రారంభించి పెద్దగా చేసుకోవచ్చు కదా అని, నా మాటని ఆరోజు ఎవ్వరూ లెక్కచేయ్యలేదు. ఇప్పుడు అమరావతి రైతుల పొట్ట కొట్టి వేరే ప్రాంతం లో రాజధాని పెడుతాము అంటే చూస్తూ ఊరుకోము. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఇప్పటుకైనా అమరావతియే, ఇది గుర్తు పెట్టుకోండి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు.
–>టాలెంట్ ఉన్న యువత కోసం పెట్టుబడి పెడుతాం : పవన్ కళ్యాణ్
టాలెంట్ ఉండి, ఉపాధి కల్పించే ప్రణాళిక ఉండి, పెట్టుబడి లేక ఇబ్బందులు పడే యువతకు ప్రతీ నియోజకవర్గం నుండి 500 మంది యువతకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ క్రింద 10లక్షలు ఇస్తాము అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.
–> ముస్లిం మేధావులకు చురకలు :
ముస్లిం మేధావులు బీజేపీ తో కలిసి ఉన్నాం కాబట్టి మాకు అండగా నిలబడం, వైసీపీ కి అండగా ఉంటాం అంటారు. కానీ బీజేపీ కి అన్ని విషయాల్లో మద్దతుగా నిలబడింది వైసీపీ. మరెలా వారికి అండగా ఉంటారు? నేను ముస్లింలపై దాడి జరిగితే మీ తరపున నిలబడే వ్యక్తిని, కానీ వైసీపీ నాయకులు ఇదే తూర్పు గోదావరి జిల్లాలో ఒక డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వారికి ఎలా అండగా ఉంటారు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు.
–>కాకినాడ MLA కి వార్నింగ్ :
కాకినాడ MLA ఒకసారి తిట్టాడు, గుర్తుంది, ఎలా మర్చిపోతాను, మా ఆడపడుచులు, నాయకులపై కులం పేరుతో దోషించావు, దాడి చేయించావు, మర్చిపోలేదు, కాకినాడలో తేల్చుకుందాం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.
–> చివరిగా :
నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయను అని మాటిస్తున్నాను, దయచేసి ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీని ఆశీర్వదించండి, గోదావరి తల్లి సాక్షిగా మీకు అండగా ఉంటాను అని మాటిస్తున్నాను