Sydney Sweeney Remuneration: సినీ ఇండస్ట్రీ లో హీరోలు తీసుకునే రెమ్యూనరేషన్ లో పావు శాతం కూడా హీరోయిన్లు తీసుకోరని రీసెంట్ గా ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం మనమంతా చూసాము. మన ఇండియా లో సినీ ఇండస్ట్రీ ఒక మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని, కానీ హాలీవుడ్ లో ఇలాంటి పరిస్థితులు ఉండవని, అక్కడ మగవాళ్లకు , ఆడవాళ్ళకు సరిసమానమైన రెమ్యూనరేషన్ ఇస్తారని , అందుకే నేను బాలీవుడ్ ని వదిలి హాలీవుడ్ కి వెళ్ళిపోయాను అంటూ ఒక పెద్ద స్టేట్మెంట్ వదిలింది. ఆమె చెప్పింది ఎంత నిజమో, ఒక హాలీవుడ్ హీరోయిన్ రెమ్యూనరేషన్ వివరాలు చూస్తే అర్థమైంది. ఆ హాలీవుడ్ హీరోయిన్ మరెవరో కాదు, స్విడ్ని స్వీనీ(Sydney Sweeney). ఎన్నో హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల్లో ఈమె హీరోయిన్ గా నటించి, ప్రస్తుతం అక్కడ టాప్ 3 హీరోయిన్స్ లో ఒకరిగా చలామణి అవుతుంది.
Also Read: ‘ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ టీజర్ ఏంటి ఇలా ఉంది…
ఈమె వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. హాలీవుడ్ లోని హీరోస్ అనే టీవీ సిరీస్ ద్వారా ఈమె 2009 వ సంవత్సరం లో బాలనటిగా హాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది. ఆ తర్వాత అనేక టీవీ సిరీస్ లు మరియు సినిమాల్లో బాలనటిగా నటిస్తూ వచ్చిన ఈమె 2015 లో ‘ది మార్షల్ ఆర్ట్స్ కిడ్’ అనే చిత్రం ద్వారా తొలిసారి లీడ్ రోల్ లో కనిపించింది. అలా సాగుతున్న ఈమె కెరీర్ లో ఎన్నో సంచలనాత్మక చిత్రాలు ఉన్నాయి. యూత్ ఆడియన్స్ లో ఈమెకు ఆ హిట్స్ కారణంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఎంతలా అంటే సినిమాలో హీరో లేకుండా, ఈమె మీద లేడీ ఓరియెంటెడ్ మూవీ తీసి బిలియన్ డాలర్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత ఫాలోయింగ్ అన్నమాట. అందుకే ఈమె ఒక్కో సినిమాకు కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో రెమ్యూనరేషన్ ని అందుకుంటూ ఉంటుంది.
అయితే ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ, సిడ్నీ స్వీనీ ని మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి తీసుకొచ్చే ప్రయత్నం చేసాడు. త్వరలోనే ఆయన నిర్మించబోతున్న ఒక భారీ బడ్జెట్ సినిమాలో ఈమెను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నాడు. ఆమె నటించడానికి ఒప్పుకుంది, కానీ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఎంతనో తెలుసా?, అక్షరాలా 530 కోట్ల రూపాయిలు. మన ఇండియా లో ఒక సినిమా సూపర్ హిట్ అయ్యి ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబడితే ఎంతో గొప్ప గా చూస్తాము, అలాంటిది ఈమె రెమ్యూనరేషన్ లాగా అడుగుతుంది అట. అయితే సిడ్నీ స్వీనీ తో సినిమా అంటే కచ్చితంగా హాలీవుడ్ లో కూడా తమ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసుకోవచ్చు, కచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం తో ఉన్నారట. చూద్దాం మరి ఈమెని మన ఇండియన్ సినిమాకు తీసుకొస్తారు లేదా అనేది.