Heroine Shriya Saran: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ కి డ్రీం గర్ల్ గా అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న శ్రీయ శరన్(Shriya saran), ఈమధ్య కాలం లో సినిమాల సంఖ్య బాగా తగ్గించేసింది. చాలా కాలం తర్వాత ఆమె రీసెంట్ గానే తేజ సజ్జ హీరో గా నటించిన ‘మిరాయ్’ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హీరో కి తల్లిగా ఆమె చక్కటి నటనతో ఆడియన్స్ ని అలరించింది. అంతే కాకుండా ప్రస్తుతం ఆమె హిందీ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం లో కూడా రావణుడి భార్యగా నటిస్తోంది. ఇక మీదట ఆమె పూర్తి స్థాయి క్యారక్టర్ రోల్స్ చేయడానికి సిద్ధం గా ఉంది. పాజిటివ్ రోల్ అయినా, నెగటివ్ రోల్ అయినా రెడీ అంటుంది. సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే, సోషల్ మీడియా లో శ్రీయ ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.
తనకు, తన ఫ్యామిలీ కి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. వాటికి వేల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ రావడాన్ని మనం గమనించొచ్చు. ఇది ఇలా ఉండగా ఆమెకు సంబంధించిన మొబైల్ నెంబర్ సోషల్ మీడియా లో లీక్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 76****1162 అనే నెంబర్ శ్రీయ కి సంబంధించినది అని, వాట్సాప్ లో కూడా ఈ నెంబర్ ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు నెటిజెన్స్. అయితే దీనిపై శ్రీయ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ‘అసలు ఈ నెంబర్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా పనిపాట లేకుండా ఇలాంటివి చేయడానికి సిగ్గు లేదా?, మీ కారణంగా ఆ నెంబర్ గల వ్యక్తి ఎందుకు ఇబ్బంది పడాలి. నేను షాక్ కి గురయ్యే విషయం ఏమిటంటే, ఈ నెంబర్ ని లీక్ చేసిన వ్యక్తి నేను గతం లో పని చేసిన నటీనటులను , నేను క్లోజ్ గా ఉండే స్నేహితులకు కూడా ట్యాగ్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు. ఇలా ఖాళీగా ఉండేబదులు ఏదైనా పనులు చూసుకోవచ్చు కదా’ అంటూ శ్రీయ శరన్ చాలా తీవ్ర స్థాయిలో స్పందించింది.