https://oktelugu.com/

Samantha: ఇలా జరగకుండా ఉంటే బాగుండు అనుకున్నాను, సమంత అంత వేదనకు గురైందా! ఆసక్తి రేపుతున్న కామెంట్స్

హీరోయిన్ సమంత రూత్ ప్రభు టాలీవుడ్ స్టార్ లేడీగా వెలుగొందుతున్నారు. 2010లో ' ఏమాయ చేసావే ' సినిమాతో పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత బృందావనం, దూకుడు, అత్తారింటికి దారేది ఇలా వరుస హిట్స్ తో దూసుకుపోయింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సూపర్ హిట్ సినిమాలు చేసింది. తన పదమూడేళ్ల కెరీర్ లో సమంత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 25, 2024 / 03:59 PM IST

    Samantha

    Follow us on

    Samantha: సామ్ కు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. అందుకే ప్రొడ్యూసర్లు ఆమెకు మంచి అవకాశాలు ఇస్తుంటారు. కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తన సొంత ప్రొడక్షన్ హౌస్ నుంచి ‘ మా ఇంటి బంగారం ‘ అనే సినిమా అనౌన్స్ చేసింది. ఇక బాలీవుడ్ లో హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ చేసింది. ఇది త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. సమంత సెలెక్టివ్ సినిమాలు చేస్తున్నారు. కెరీర్ పరంగా స్లో అయ్యారు.

    Also Read: సందీప్ కిషన్ కి ఉన్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా..? రాయన్ షూట్ లో ఏం జరిగిందంటే..?

    అయినప్పటికీ కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆమెకు ఆఫర్లు వస్తున్నప్పటికీ ఆచితూచి సినిమాలు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ మన జీవితాల్లో జరిగే కొన్ని విషయాలు మార్చుకోవాలని అందరం కోరుకుంటాము. ఒక్కోసారి వీటన్నిటిని భరించాల్సిందేనా అని ఆశ్చర్యపోతాం. ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటాము. వెనక్కి తిరిగి చూసుకుంటే వేరే మార్గం ఉండదు.

    గత మూడేళ్లుగా ఇలా జరగకుండా ఉంటే బాగుండేదని ఎన్నో విషయాల్లో అనుకున్నాను. కానీ జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందే. అలాంటివి ఎదుర్కొన్నప్పుడే జీవితాన్ని గెలిచినట్లు భావిస్తాను. గతంలో పోలిస్తే నేను ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాను. ఈ స్థాయికి రావడానికి అగ్ని గుండాల్లాంటి ఎన్నో సవాళ్ళను దాటాను అని అన్నారు. అయితే సమంత ఈ కామెంట్లు తన విడాకుల గురించి చేశారని స్పష్టంగా అర్థమవుతుంది.

    ఆమె నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఎంతో మానసిక క్షోభను అనుభవించారు. ఆ డిప్రెషన్ నుంచి బయట పడటానికి సమంతకు చాలా సమయం పట్టింది. అదే సమయంలో మయోసైటిస్ బారిన పడటం ఇలా గత మూడేళ్లలో మానసికంగా, ఆరోగ్యపరంగా సామ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సమంత కెరీర్ పైనే ఫోకస్ చేస్తుంది. ఆమె నటించిన హనీ బన్నీ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

    సమంత బాల్యం నుండి ఇండిపెండెంట్ గా ఉండేవారు. చదువుకునే రోజుల్లో తన ప్యాకెట్ మనీ కోసం పేరెంట్స్ మీద ఆధారపడతుందా ఆమె జీవించారు. మోడలింగ్ స్టార్ట్ చేసి యాడ్స్ లో నటించింది సమంత. ఆ వచ్చిన డబ్బులను చదువుకు, ఇతర అవసరాలకు వాడేది. సమంత బ్రిలియంట్ స్టూడెంట్ కూడాను. మొదటి నుండి బాగా చదివేది. ఆమె క్లాస్ ఫస్ట్.

    కాగా విడాకుల తర్వాత సమంత ఆధ్యాత్మిక బాట పట్టింది. ఆమె పలు పుణ్యక్షేత్రాలు సందర్శించింది. బాబా సద్గురును ఆమె ఫాలో అవుతారు. ఆయన ఆశ్రమాన్ని తరచుగా సందర్శిస్తూ ఉంటారు. ప్రతి శివరాత్రికి కేరళ వెళ్లి జాగారం చేస్తుంది. ఆమెకు సద్గురు ప్రవచనాల పట్ల అంత నమ్మకం ఉంది. మరో సమంత రెండో పెళ్లి చేసుకుంటుంది లేనిదీ విషయంలో క్లారిటీ లేదు. ఆమెకు ఆ ఆలోచన లేదనే వాదన ఉంది.

    Also Read: వెయ్యి కోట్ల హీరోను డామినేట్ చేస్తున్న ఆడవాళ్లు… ఇది మామూలు ట్విస్ట్ కాదు