https://oktelugu.com/

KCR: అబ్రకదబ్ర బడ్జెట్‌.. మాటలతో మాయ చేసిండ్రు.. భట్టి పద్దుపై కేసీఆర్‌ రియాక్షన్‌!

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో పింఛన్ల పెంపు, మహిళలకు ఆర్థిక సాయం విద్యార్థినులకు స్కూటీ, విద్యా రుణాల గురించిన ప్రస్తావనే లేదు. ఇదే సమయంలో గత ప్రభుత్వం ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం, దళిత బంధు పథకం కొనసాగిస్తారా, ఉచిత చేపపిల్లల పంపిణీ కొనసాగుతుందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇన్నాళ్లూ పథకం నిలిచిపోయింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 25, 2024 / 04:03 PM IST

    KCR

    Follow us on

    KCR: తెలంగాణ బడ్జెట్‌ ప్రజల ఆశలపై నీళ్లు చల్లేలా ఉందని మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రతిపక్ష నేతల, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకంట్ల చంద్రశేఖర్‌రావు విమర్శించారు. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది. దీంతో ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌ ప్రశాంతంగా ప్రసంగం విచాన్నరు. అసెంబ్లీ వాయిదా తర్వాత మీడియా పాయింట్‌కు వచ్చి మాట్లాడారు. తమ పాలనలో ఎన్నో పథకాలు బడ్జెట్‌లో పెడితే.. ప్రస్తుత బడ్జెట్‌లో వాటన్నింటినీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. రైతులకు, మత్స్యకారులకు, యాదవులకు ఇలా ఏవర్గానికి బడ్జెట్‌ మేలు చేసేలా లేదన్నారు. ఐటీ, పారిశ్రామిక విధానాలులేవని పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్‌ అంతా గ్యాస్, ట్రాష్‌ అని విమర్శించారు. ఆర్థిక మంత్రి ఒత్తి ఒత్తి మాట్లాడే మాటలే తప్ప కొత్తగా ఏమీ చెప్పలేదని పేర్కొన్నారు. ఏదో కథ చెప్పినట్లు.. రాజకీయ ప్రసంగంలా ఉందే తప్ప ఏ ఒక్క వర్గానికి మేలు చేసేలా లేదని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడ్డాక వీళ్లకు ఆరు నెలలు సమయం ఇద్మాని అనుకన్నానని తెలిపారు. అందుకే అసెంబ్లీకి కూడా రాలేదని తాను అసెంబ్లీకి రాకపోవడానికి కారణం చెప్పకనే చెప్పారు. సమర్థించుకున్నారు. ఇప్పుడు బడ్జెట్‌ చూశాక బాధగా ఉందన్నారు. రైతుభరోసా ప్రస్తావనే లేదని, ఇది పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. భవిష్యత్‌లో ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని తెలిపారు.

    ఆ పథకాల ప్రస్తావనే లేదు..
    ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో పింఛన్ల పెంపు, మహిళలకు ఆర్థిక సాయం విద్యార్థినులకు స్కూటీ, విద్యా రుణాల గురించిన ప్రస్తావనే లేదు. ఇదే సమయంలో గత ప్రభుత్వం ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం, దళిత బంధు పథకం కొనసాగిస్తారా, ఉచిత చేపపిల్లల పంపిణీ కొనసాగుతుందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇన్నాళ్లూ పథకం నిలిచిపోయింది. బడ్జెట్‌ సందర్భంగా వీటిపై క్లారిటీ వస్తుందని అందరూ భావించారు. కానీ, వీటి గురించి భట్టి విక్రమార్క ప్రసంగంలో ఎక్కడా కనిపించలేదు.

    కొత్త పథకాలు లేవు..
    ఇదిలా ఉంటే.. బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలు ఏవీ ప్రకటించలేదు. అమలు చేస్తున్న పథకాలకే నిధులు కేటాయించింది. ఇందులో గృహజ్యోతి, గ్యాస్‌ సిలిండర్, రుణమాఫీ, రైతుభరోసా, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాలకే నిధులు కేటాయించింది. పింఛన్ల పెంపు, మహిళలకు ఆర్థికసాయం కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలే. అయినా వీటి గురించి బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు జరుగలేదు. దీంతో బడ్జెట్‌పై బీఆర్‌ఎస్, బీజేపీతోపాటు ప్రజలు కూడా పెదవి విరుస్తున్నారు. కొత్తగా ప్రకటించిన విషయం ఏదైనా ఉందా అంటే అది మహిళా సంఘాల సభ్యులకు రూ.10 లక్షల బీమా మాత్రమే. దీంతో రాష్ట్రంలోని 63.86 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయని వీటిలోని సభ్యులకు ఈ బీమాతో లబ్ధి కలుగుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. ఇక బడ్జెట్‌లో మహిళా శక్తి పథకానికి రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ నిధులు దేనికి వెచ్చిస్తార్న అంశంపై క్లారిటీ ఇవ్వలేదు.

    రూ.2 లక్షల రుణమాఫీ..
    ఇదిలా ఉంటే.. మహిళా సంఘాల సభ్యులకు ఈ బడ్జెట్‌లో ఊరట లభించింది. రూ.10 లక్షల బీమాతోపాటు.. సంఘాల్లో సభ్యులుగా ఉంటూ.. ఏదైనా కరాణంతో మరణిస్తే ఇకపై రుణం చెల్లించే అవసరం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో సభ్యురాలు మరణించినా రుణం చెల్లించాల్సి వచ్చేదని, ఇకపై ఆ అవసరం ఉండదన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.50 కోటుల కేటాయిస్తున్నట్లు తెలిపారు.