Heroine Regina: సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్. ఇందులో లవ్.. రిలేషన్‌షిప్ లాంటివి చాలా సాధారణ విషయమని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే కొందరు స్టార్స్.. లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు కెరీర్ సాఫీగా ఉందని వివాహం చేసుకోకుండా చాలా ఏళ్లపాటు అలానే ఉండిపోతారు. ఇలాంటి వారిలో హీరోల కంటే హీరోయిన్సే ఎక్కువ. తాజాగా ఈ జాబితాలో హీరోయిన్ రెజీనా కూడా చేరిపోయారు.

చెన్నై బ్యూటీ రెజీనా తొలుత కోలీవుడ్‌లో నట పయనాన్ని ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్ తదితర దక్షిణాది భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005లో కండనాళ్ మొదల్ తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం విజయంతో ఇక్కడ మరికొన్ని చిత్రాలు అవకాశాలను రాబట్టుకుంది. కానీ కోలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను అందుకోలేకపోయింది.
లవ్.. బ్రేకప్
హీరోయిన్ రెజీనా అనగానే తెలుగు ప్రేక్షకులకు ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘అ!’, ‘ఎవరు’ తదితర సినిమాలు గుర్తొస్తాయి. తెలుగు, తమిళంలో దాదాపు 35కి పైగా సినిమాలు చేసింది. ఈ మధ్య ‘ఆచార్య’లో స్పెషల్ సాంగ్ చేసి అలరించింది. త్వరలో ‘శాకిని డాకిని’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వూలు ఇస్తూ బిజీగా ఉన్న రెజీనా.. లవ్.. బ్రేకప్.. పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇక పెళ్లి చేసుకోనేమో..
తాను పెళ్లికి రెడీ అనే వార్తలపై స్పందించిన రెజీనా.. 2020లో లవ్ ముగిసిందని, దాన్నుంచి బయటపడటానికి సమయం పట్టిందని తెలిపింది. ప్రస్తుతమైతే ఎవరినీ ప్రేమించడం లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రేమ–పెళ్లి విషయాలపై మాట్లాడటం కూడా తనకు ఇష్టం లేదని మ్యారీడ్ లైఫ్‌పై వ్యతిరేక భావం వ్యక్తం చేసింది. జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదని చెప్పింది. ఎవరిపై ఆధారపడకుండా బతకడం ఎలానో చిన్నప్పుడే తన తల్లి నేర్పిందని.. ఈ నేపథ్యంలో జీవితంలో తోడు కావాలా వద్దా అనే విషయాలు ఇకపై ఆలోచించని పేర్కొంది.

వెబ్ సీరీస్‌లలో బిజీ..
ఈ మధ్యకాలంలో రెజీనా హీరోయిన్‌గా సినిమాలో నటించకపోయినా పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. వృత్తిపరమైన జీవితం సాఫీగా సాగుతోందని స్పష్టం చేసింది. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆటుపోట్లు ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపిన విషయాలను బట్టి అర్థమవుతోంది.