Karthika Deepam: బుల్లితెరలో సీరియళ్లదే ప్రధాన పాత్ర. ఒక్కో సీరియల్ ను వేలాది ఎపిసోడ్ లుగా పొడిగించి బోరు కొట్టిస్తుంటారు. అయినా మహిళలు వాటిని ఇష్టపడుతూనే ఉన్నారు. దీంతో సీరియళ్ల హవా కొనసాగుతోంది. టెలివిజన్ చరిత్రలోనే సీరియళ్లకు ప్రధానమైన డిమాండ్ రావడానికి కారణం ఆడాళ్లే. వారు సీరియళ్లంటే పడి చస్తారు. ఇంట్లో సీరియల్ పెట్టకపోతే నానా హంగామా చేసేవారు ఉండటంతో సీరియళ్ల ప్రస్థానం ఇంకా కొనసాగుతోంది. బుల్లితెర అంటేనే సీరియళ్లు కావడం చూస్తున్నాం. సాయంత్రం అయిందంటే చాలు ఏ టీవీ చూసినా సీరియల్ పెట్టుకోవడం పెద్ద విషయమేమీ కాదు. సీరియళ్లకు వస్తున్న ఆదరణతోనే అవి నిరంతరంగా కొనసాగుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

బుల్లితెర రంగంలోనే నూతన ట్రెండ్ సృష్టించింది కార్తీక దీపం సీరియల్. దీనికి చాలా మంది ఆకర్షితులయ్యారు. ఇక ఏ టీవీ పెట్టినా ఆ సీరియల్ కనిపించేది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వేలాది ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న సీరియల్ ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రేక్షకుల ఆదరణ తగ్గుతోంది. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలకంటే ఎక్కువ రేటింగ్ రావడంతో అందరు అవాక్కయ్యారు. కానీ కొద్ది రోజులుగా ఆ స్థాయిలో రేటింగ్ రావడం లేదు. దీంతో సీరియల్ కు ఎందుకు ప్రాధాన్యం తగ్గిందనే దానిపై దృష్టి సారిస్తున్నారు.
గతంలో డాక్టర్ బాబుగా కార్తీక్, వంటలక్కగా దీప అద్భుతమైన నటన చూపించేవారు. దీంతో ప్రేక్షకులు మైమరచిపోయేవారు. ఆ సీరియల్ కోసమే ఎదురు చూసేవారు. అంతటి స్టామీనా ఉండటంతో సీరియల్ ను అందరు చూశారు. కానీ కార్తీక్, దీప పాత్రలను చంపేసి కొత్త వారితో సీరియల్ ను కొనసాగించడంతో కొంతమంది నిరాశకు గురయ్యారు. ఇక కార్తీక దీపం చూసేందుకు ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో యాజమాన్యం మళ్లీ ఆ పాత్రలను బతికించి కొత్త పుంతలు తొక్కించాలని భావించారు. ఇందులో భాగంగానే వారి పాత్రలను మళ్లీ బతికించి ఏదో లాగిస్తున్నారు.

దీనిపై ప్రేక్షకుల్లో ఇష్టం తగ్గిపోయింది. సీరియల్ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో ఇక దాన్ని చూసేందుకు మొగ్గు చూపడం లేదు. పాత పాత్రలతో నడిచినప్పుడే బాగా ఆకర్షితులైన వారు ప్రస్తుతం మాత్రం కార్తీక దీపం చూసేందుకు వెనుకాడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. కార్తీక దీపం సీరియల్ లో కార్తీక్, దీప పాత్రలకు శౌర్య, హిమల పాత్రలు పెట్టడంతో ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. కానీ చివరకు పాత పాత్రలను తీసుకొచ్చినా జీర్ణించుకోలేకపోవడం గమనార్హం.
సీరియల్ ను ఎలా పడితే అలా తీస్తే ప్రేక్షకులు వెర్రి వాళ్లు కాదు కదా. కీలెరిగి వాత పెడతారు. చూస్తున్నారు కదాని కథను ఎన్నో మలుపులు తింపితే ఫలితం ఇలాగే ఉంటుంది. చక్కగా నడిచే సీరియల్ ను కీలక మలుపులు తిప్పేందుకు వారి పాత్రలను మధ్యలోనే చంపేయడం విమర్శలకు తావిచ్చింది. సీరియల్ తీసేవారు కాస్త ఆలోచించి జాగ్రత్తగా తీస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ ఇష్టారాజ్యంగా చేస్తే ఎవరికైనా కోపం రావడం సహజమే. ఇప్పటికైనా కార్తీక దీపం సీరియల్ యాజమాన్యం బుద్ధి తెచ్చుకుని సీరియల్ ను సక్రమ మార్గంలో నడిపిస్తే ఫలితం ఉంటుందేమో వేచి చూడాల్సిందే మరి.