Bigg Boss-6 Arohi Rao: తెలుగు బిగ్ బాస్ లో తొలి వారం కూడా కాలేదు అప్పుడే గొడవలు, కొట్లాటలు, అలకలు.. ఓ రేంజ్ లో సాగుతున్నాయి. కంటెస్టెంట్ల వైరం పతాకస్థాయికి చేరుతోంది. ఏకంగా 21 మందిని హౌస్ లోకి పంపడంతో హౌస్ అంతా రచ్చ రంబోలాగా మారింది. ముఖ్యంగా నిన్న జరిగిన సింగర్ రేవంత్, టీవీ9 యాంకర్ ఆరోహీ రావుల మధ్య సంవాదం ఓ రేంజ్ లో సాగింది. ఇద్దరూ తగ్గేదేలే అంటూ రెచ్చిపోవడంతో వీక్షకులకు కావాల్సిన మసాలా దొరికింది. నెటిజన్లు దీనిపై రెచ్చిపోతున్నారు. అచ్చ తెలంగాణలో బూతులతో ఆరోహీరావు చితక్కొట్టేస్తోంది.

సింగర్ రేవంత్ పై ఆరోహీరావు తెలంగాణ యాసలో నాటు రోమాంటిక్ తిట్లు తిట్టింది. వాటిని విని కొందరు నవ్వుకోగా.. మరికొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. అప్పట్లో ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను బయటకు తీసి ట్రోల్ చేస్తున్నారు.
తాను చిన్నప్పుడు మరీ అమాయకంగా ఉండేదాన్ని అని.. ముద్దు పెట్టుకుంటే గర్భం వచ్చే అవకాశం ఉందనే భ్రమలో బతికేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాక అన్ని విషయాలు తెలిశాయని ఆరోహీరావు చెప్పుకొచ్చింది. అయితే ప్రేమ ఫలించలేదని.. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయామని.. ఇప్పటికీ ఫ్రెండ్స్ గా ఉంటూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నామని తెలిపింది.

ప్రస్తుతం ముద్దు పెట్టుకుంటే కడుపు అవుతుందన్న ఆరోహీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఇదే బిగ్ బాస్ లో సూర్య చేత నుదుటిపై ముద్దు పెట్టించుకుంది. ఓదార్పులో భాగంగా ఈ ముద్దు హగ్గు ఇచ్చాడు సూర్య. దీంతో ఆమె పాత మాటలు బయటకు తీసి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.