https://oktelugu.com/

Rashmika Mandanna: షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చిన రష్మిక ఏం చేసిందో తెలుసా? అసలు అభిమానులు ఊహించని పరిణామం!

రష్మిక మందాన నగరంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చారు. ఆమె రాక విషయం తెలిసిన అభిమానులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాగా తనని చూసేందుకు వచ్చిన అభిమానుల కోసం రష్మిక మందాన చేసిన పనికి జనాలు ఫిదా అవుతున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 29, 2024 / 08:37 AM IST

    Rashmika Mandanna

    Follow us on

    Rashmika Mandanna: రష్మిక మందాన దేశంలోనే బిజీ యాక్ట్రెస్. చేతి నిండా సినిమాలతో ఊపిరి సలుపుకోలేని షెడ్యూల్స్ కలిగి ఉంది. కన్నడ భామ రష్మిక మందాన కిరాక్ పార్టీ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఈ యూత్ ఫుల్ లవ్ డ్రామా సూపర్ హిట్. ఆ మూవీ హీరో రక్షిత్ శెట్టితో రష్మిక మందాన ప్రేమలో పడింది. నిశ్చితార్థం కూడా జరుపుకుంది. పెళ్ళైతే కెరీర్ మటాష్ అవుతుందని భావించిన రష్మిక మందాన నిర్ణయం మార్చుకుంది. రక్షిత్ శెట్టితో తెగదెంపులు చేసుకుంది.

    Also Read: ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదు.. వీడియో లీక్ పై ఊర్వశి రౌతేలా ఓపెన్ కామెంట్స్! వివాదం ఏమిటంటే?

    అనంతరం ఆమె టాలీవుడ్ పై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యింది. తెలుగులో రష్మిక మొదటి చిత్రం ఛలో. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక గీత గోవిందం మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టింది. విజయ్ దేవరకొండకు జంటగా రష్మిక మందాన నటించిన గీత గోవిందం భారీ వసూళ్లు రాబట్టింది. అత్యధిక లాభాలు పంచిన చిత్రాల జాబితాలో చేరింది. సరిలేరు నీకెవ్వరు, పుష్ప చిత్రాలతో రష్మిక మందాన స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.

    నేషనల్ క్రష్ ట్యాగ్ తో ఇండియా వైడ్ ఫేమ్ రాబట్టింది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లో చిత్రాలు చేస్తుంది. యానిమల్ మూవీతో హిందీలో కూడా భారీ విజయం నమోదు చేసింది. గత ఏడాది విడుదలైన యానిమల్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. రష్మిక అరడజను చిత్రాల వరకు చేస్తుంది. గర్ల్ ఫ్రెండ్, రైన్ బో ఆమె నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు. విక్కీ కౌశల్ కి జంటగా ఓ చిత్రంలో నటిస్తుంది.

    రష్మిక మందాన నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల షూటింగ్ కి షార్ట్ బ్రేక్ ఇచ్చారు. సుకుమార్, అల్లు అర్జున్ వ్యక్తిగత పనుల మీద విదేశాలకు వెళ్లారు. తిరిగి వచ్చిన సుకుమార్ రామోజీ ఫిల్మ్ సిటీలో పుష్ప 2 షూటింగ్ పునః ప్రారంభించారు. ఆగస్టు లో అల్లు అర్జున్ జాయిన్ అవుతారట. పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం.

    రష్మిక మందాన ఇమేజ్ ని మరో స్థాయికి పుష్ప 2 తీసుకెళ్లే అవకాశం కలదు. పుష్ప 2 డిసెంబర్ 6న థియేటర్స్ లోకి వస్తున్నట్లు సమాచారం. కాగా రష్మికకు భారీ అభిమాన గణం ఉంది. ఆమె పబ్లిక్ లో కనిపిస్తే ఫ్యాన్స్ ఎగబడిపోతారు. తాజాగా రష్మిక మందాన ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొన్నారు. రష్మిక మందాన వస్తున్న విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అక్కడకు వందల సంఖ్యలో చేరారు.

    షాపింగ్ మాల్ ఓపెనింగ్ అనంతరం కారులో వెళ్ళిపోతున్న రష్మిక.. అభిమానుల కోసం ఆగారు. తనను చూడాలి అనుకుంటున్న వారి కోరిక తీర్చారు. కారు బయటకు వచ్చి ఫ్యాన్స్ కి అభివాదం చేసింది. కొన్ని ఫ్లయింగ్ కిస్సులు కూడా వదిలింది. సాధారణంగా హీరోయిన్స్ వీలైనంత త్వరగా పబ్లిక్ ప్రదేశాల నుండి జారుకోవాలి అనుకుంటారు. రష్మిక మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి హృదయాలు గెలుచుకుంది.

    Also Read: బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ అప్పుడే డిసైడ్ అయిపోయిందా..? అదే నిజమైతే చరిత్ర అవుతుంది!