https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ అప్పుడే డిసైడ్ అయిపోయిందా..? అదే నిజమైతే చరిత్ర అవుతుంది!

బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ అప్పుడే ఫిక్స్ అయ్యిందట. ఈసారి కప్ అందుకునే కంటెస్టెంట్ తానే అంటూ ఓ ప్రచారం మొదలైంది. షో ఇంకా మొదలే కాలేదు. అప్పుడే విన్నర్ ఎవరో చెప్పడం విడ్డూరం అంటుంటే.... కాదు ఈ లెక్కన విన్నర్ డిసైడైపోయింది అంటున్నారు. మరి ఆ కథ ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : July 28, 2024 / 03:53 PM IST

    Bigg Boss 8 Telugu

    Follow us on

    Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ సందడి మొదలైపోయింది. కొత్త సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఎవరు, టాస్కులు ఎలా ఉండబోతున్నాయి, ఎంతమందిని హౌస్ లోకి పంపుతారు, హోస్ట్ ఎవరు ఇలాంటి అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కాగా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 8 స్టార్ట్ కానుందని సమాచారం. ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే గేమ్ షో ప్రసారం అవుతుంది. దీనికి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తుంది.

    Also Read: బిగ్ బాస్ హోస్ట్స్ సల్మాన్-నాగార్జున రెమ్యూనరేషన్స్ తెలుసా? ఏంటి అంత వ్యత్యాసమా!

    అనసూయ భరద్వాజ్, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా ఉన్నారు. అయితే ఆగస్టు నెలాఖరుకు ఈ కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో ముగియనుంది. ఆ తర్వాత వారంలో బిగ్ బాస్ సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుంది అని తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అయిన విషయం తెలిసిందే. కంటెస్టెంట్స్ లిస్ట్ చూసిన నెటిజన్లు షో స్టార్ట్ అవ్వక ముందే విన్నర్ ఎవరు అనేది డిసైడ్ చేసేస్తున్నారు. పక్కాగా విన్నర్ అయ్యేది ఆమె అంటూ తేల్చి చెప్తున్నారు.

    ఆమె మరెవరో కాదు కుమారి ఆంటీ. ఈ పేరు సోషల్ మీడియాలో ఎంత సెన్సేషనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటి వరకు కుమారి ఆంటీ పేరు మారుమోగిపోయింది. హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ ఆమె బాగా ఫేమస్ అయ్యారు. రెండు లివర్లు ఎక్స్ట్రా అనే డైలాగ్ ఎంత ట్రెండ్ అయిందో తెలిసిందే. ఆమె పాపులర్ అవడంతో సెలెబ్రెటీలు సైతం కుమారి ఆంటీ వద్దకు రావడం. సినిమా ప్రమోషన్స్ వంటివి చేశారు. ఇటీవల బాలీవుడ్ నటుడు సోనూసూద్ సైతం కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ ని సందర్శించారు.

    దీంతో ఆమెకు క్రేజ్ మరింత పెరిగింది. అంతేకాదు టీవీ షోలు, సినిమాలు, సీరియల్స్ అంటూ కుమారి ఆంటీ సందడి మాములుగా లేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె బిగ్ బాస్ కి వెళ్తున్నట్లు లీక్ చేసింది. దీంతో కుమారి ఆంటీ మీ వెంట మేము ఉన్నాము. పవన్ కళ్యాణ్ ఫోటోతో ఎంట్రీ ఇవ్వండి. మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాము. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం మీ వెనుక ఉంటారు. ఇక మీకు తిరుగుండదు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ మీరే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    మరి ఇదే జరిగితే బిగ్ బాస్ చరిత్రలో రికార్డు అవుతుంది. కారణం.. గత 7 సీజన్స్ లో లేడీ కంటెస్టెంట్స్ ఎవరూ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్ కాలేదు. సింగర్ గీతా మాధురి, యాంకర్ శ్రీముఖి టైటిల్ రేసులో నిలిచారు. కానీ వారు విన్నర్ కాలేకపోయారు. కుమారీ ఆంటీ టైటిల్ గెలిచిన నేపథ్యంలో మొదటి లేడీ కంటెస్టెంట్ అవుతుంది. మరి చూడాలి కుమారి ఆంటీ ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా అనేది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా హౌస్ కి వెళ్లక ముందే కుమారీ ఆంటీ ప్రొజెక్ట్ చేసుకోవడం విశేషం.

     

    Also Read: చిన్న పిల్లాడితో పాటు ఆయనను ఎత్తుకున్న వ్యక్తి టాలీవుడ్ ప్రముఖుడే.. ఎవరో చెప్పుకోండి..