https://oktelugu.com/

Urvashi Rautela : ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదు.. వీడియో లీక్ పై ఊర్వశి రౌతేలా ఓపెన్ కామెంట్స్! వివాదం ఏమిటంటే?

హీరోయిన్ ఊర్వశి రౌతెలా ప్రైవేట్ వీడియో అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సదరు వీడియోలో ఊర్వశి రౌతేలా బాత్ రూమ్ లో స్నానం చేస్తుంది. ఇది ఫేక్ అని కొందరు భావించారు. ప్రమోషన్ కోసం దిగజారింది అంటూ మరికొందరు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఊర్వశి రౌతేలా స్పందించింది.

Written By:
  • S Reddy
  • , Updated On : July 28, 2024 / 07:10 PM IST
    Follow us on

    Urvashi Rautela : బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, బ్రో, స్కంద చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో స్టెప్పులేసి మెస్మరైజ్ చేసింది. అంతేకాదు దర్శకుడు బాబీ, బాలయ్య కాంబోలో వస్తున్న ఎన్ బి కే 109 లో కీలక పాత్రలో నటిస్తుంది. వీటితో పాటు పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. అయితే ఇటీవల ఊర్వశి రౌతేలా కి సంబంధించిన ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో తెలిసిందే.

    తాజాగా ఈ వీడియో పై ఊర్వశీ రౌతేలా స్పందించింది. ఆ వీడియో క్లిప్ వెనుకున్న అసలు విషయం రివీల్ చేసింది. వారం రోజుల క్రితం బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌతేలా బాత్రూమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆమె బాత్రూమ్ లో స్నానం చేయడానికి వెళ్లిన వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అయింది. అయితే ఇది ఫేక్ వీడియో అని కొందరు కామెంట్స్ చేశారు. ఒకవేళ పబ్లిసిటీ స్టంట్ అని ఇంకొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

    సినిమా ప్రమోషన్ కోసం ఇంతలా దిగజారాలా అంటూ ఆ వీడియో చూసిన వారు మండిపడ్డారు. అది ఒరిజినల్ వీడియోనా, లేక ఎవరైనా డీప్ ఫేక్ చేశారా అనేది మాత్రం స్పష్టం కాలేదు. అయితే తాజాగా ఊర్వశి రౌతేలా దీనిపై మాట్లాడారు. అది ఓ మూవీ షూటింగ్ లో క్లిప్ మాత్రమే అని చెప్పారు. ఆమె మాట్లాడుతూ .. నేను నటిస్తున్న కొత్త మూవీ ‘ గుస్పెటియా ‘. ఆ సినిమాలో నాపై చిత్రీకరించిన సీన్ ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    అది నన్నెంతో బాధించింది. సినిమా విడుదలకు ముందే వీడియోస్, ఫొటోలో లీక్ కావడం నిరాశకు గురిచేసింది. అది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియో కాదు. ఏ అమ్మాయికి ఇటువంటి చేదు అనుభవం ఎదురు కాకూడదు అని కోరుకుంటా అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా ఈ ‘ గుస్పెటియా ‘ చిత్రానికి సుషీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ ఒబెరాయ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం ఆగష్టు 9 న విడుదల కానుంది.

    అయితే ఇటీవల ఊర్వశి రౌతేలా షూటింగ్ సమయంలో తీవ్ర గాయాలపాలయ్యారు. నందమూరి బాలకృష్ణ ఎన్ బి కే 109 సినిమాలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. సెట్ లో ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఆమెకు గాయాలు అయ్యాయట. మూవీ టీం ఆమెను వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించారట. ప్రస్తుతం బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా సినిమాలు చేస్తూ ఊర్వశి రౌతేలా బిజీగా ఉన్నారు.

    ఊర్వశి రౌతేలా మోడల్ గా కూడా ఫుల్ బిజీ. సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఊర్వశి రౌతేలా గ్లామరస్ వీడియోలు తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. ఊర్వశి రౌతేలా సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ అని చెప్పొచ్చు. ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని మిలియన్స్ కొద్దీ ఫాలో అవుతున్నారు.