Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించి పెట్టుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ భారీ విజయాలను సాధిస్తున్న హీరోల విషయం పక్కన పెడితే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరోసారి బాలీవుడ్ లో తమ దైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు… ఇక ఇప్పటివరకు 1700 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లో బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 రిలీజ్ రోజున థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మృతి చెందడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విషయం మనకు తెలిసిందే…ఇక దాంతో తెలంగాణ ప్రభుత్వం థియేటర్ యాజమాన్యం మీద అల్లు అర్జున్ మీద తీవ్రమైన కోపాన్ని ప్రదర్శిస్తూ వాళ్ల మీద కేసు కూడా ఫైల్ చేసింది. మరి మొత్తానికైతే ఇప్పుడు వాళ్ళ మీద కేసు పకడ్బందీ ప్రణాళికలతో సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ చేసిన పనికి ఇకమీదట ఏ సినిమాకి కూడా బెనిఫిట్ షో లు గానీ, టికెట్ల పెంపునకు గాని అవకాశం ఇవ్వము అంటూ తెలంగాణ ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన అయితే చేశారు. మరి దీనివల్ల సినిమాలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భారీ బడ్జెట్ లో సినిమాలను చిత్రీకరిస్తున్నారు.
కాబట్టి ఆ సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వాలంటే టికెట్ల రేట్లు గానీ, బెనిఫిట్ షోలకు అవకాశం ఉండి తీరాల్సిందే. లేకపోతే మాత్రం ఆ సినిమాల మీద హైప్ తగ్గిపోవడమే కాకుండా ఆ సినిమాలను కూడా చూడడానికి ఎవరు పెద్దగా ఉత్సాహాన్నైతే చూపించరు.
కాబట్టి ఒక అల్లు అర్జున్ వల్లే ఇదంతా జరిగింది అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం అతని మీద ఫైర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీని ఎక్కడకో తీసుకెళ్తాడని అందరూ అనుకున్నారు.
కానీ పుష్ప 2 సినిమా సూపర్ సక్సెస్ అయినప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఇక ఎక్కువ ఆదరణ దక్కే అవకాశం లేకుండా చేశాడు అంటూ చాలామంది వివిధ రకాల కామెంట్లైతే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట రాబోయే సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఇబ్బందులు ఎదురుకోవాల్సిందే…