https://oktelugu.com/

Gold Prices: పెళ్లిళ్లు చేసుకేనేవారికి మంచి ఛాన్స్.. మరోసారి తగ్గిన ధరలు..

బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 6న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,00గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,270 గా ఉంది. జనవరి 5న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,100తో విక్రయించారు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 6, 2024 / 08:41 AM IST

    Gold Prices Today

    Follow us on

    Gold Prices: బంగారం ధరలు మరోసారి తగ్గాయి. కొన్ని రోజులు హైక్ పొజిషన్లో ఉన్న గోల్డ్ ప్రైస్ మూడు రోజులుగా వరుసగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లు చేసుకునేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అటు వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగాయి.దేశీయంగా బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

    బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 6న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,00గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,270 గా ఉంది. జనవరి 5న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,100తో విక్రయించారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు రూ.100 మేరకు తగ్గింది. మూడు రోజులుగా రూ.700 తగ్గడం విశేషం. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,400గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.63,270 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,930తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,000 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,270తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,000తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,270తో విక్రయిస్తున్నారు.

    బంగారం ధరలు పెరిగినా వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76,600గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,600గా ఉంది. ముంబైలో రూ.76,600, చెన్నైలో రూ.78,000, బెంగుళూరులో 75,000, హైదరాబాద్ లో రూ.78,000తో విక్రయిస్తున్నారు.