https://oktelugu.com/

Lavanya Tripathi: హీరోయిన్ లావణ్య త్రిపాఠి మార్నింగ్ లుక్… బెడ్ పై నుండి లేస్తూనే గ్లామరస్ సెల్ఫీ!

లావణ్య కెరీర్ పూర్తిగా డల్ అయ్యింది. ఆమెకు విజయం దక్కి చాలా కాలం అవుతుంది. ఇటీవల లావణ్య నటించిన ఏ వన్ ఎక్స్ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే నిరాశపరిచాయి. పులి మేక టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేసింది. అది కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. లావణ్య త్రిపాఠి దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. ఆమె చేతిలో ఒక్క ఆఫర్ లేదు. మంచి ఆరంభం లభించినా లావణ్య నిలదొక్కుకోలేకపోయింది.

Written By:
  • Shiva
  • , Updated On : June 6, 2023 / 11:53 AM IST

    Lavanya Tripathi

    Follow us on

    Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటారు. అలాగే ఆమె నటిస్తున్న ప్రాజెక్ట్స్ అప్డేట్స్ ఇస్తారు. లావణ్య త్రిపాఠి తాజాగా మేకప్ లెస్ లుక్ షేర్ చేశారు. మార్నింగ్ లేస్తూనే తాజా సెల్ఫీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. లావణ్య నేచురల్ లుక్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి పేరు ఈ మధ్య ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె మెగా కోడలు కానున్నారనే ప్రచారం జరుగుతుంది. హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్ళికి సర్వం సిద్ధం అవుతుందట.

    ఈ నెలలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం అట. ఈ వార్తలను మెగా ఫ్యామిలీ కానీ లావణ్య త్రిప్పటి కానీ ఖండించలేదు. దీంతో పెళ్లిభాజ మోగడం ఖాయమే అంటున్నారు. ఏడాదికి పైగా లావణ్య-వరుణ్ తేజ్ పెళ్లి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ మధ్య లావణ్యతో పెళ్లి కన్ఫర్మ్ చేసేందుకు వరుణ్ తేజ్ బెంగుళూరు వెళ్లారంటూ ప్రచారం జరిగింది. కొన్నాళ్ళు ఈ రూమర్స్ సద్దుమణిగాయి. తాజాగా మరలా తెరపైకి వస్తున్నాయి.

    జరుగుతున్న ప్రచారం నిజమైతే జూన్ నెలలో వరుణ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం అట. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగనుందట. మెగా హీరోలు అందరూ హాజరుకున్నారట. పెళ్ళి మాత్రం పరిశ్రమ ప్రముఖుల మధ్య ఘనంగా నిర్వహించనున్నారని తెలుస్తుంది. వరుణ్ తేజ్ భార్యగా లావణ్య మెగా ఫ్యామిలీలో అడుగుపెడితే ఆమె దశ తిరిగినట్లే. కెరీర్ తో సంబంధం లేకుండా లైఫ్ సెటిల్ అవుతుంది.