https://oktelugu.com/

Adipurush Collections: ‘వకీల్ సాబ్’ మరియు ‘సర్కారు వారి పాట’ కలెక్షన్స్ ని దాటలేకపోయిన ‘ఆదిపురుష్’

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతం లో మాత్రం ఆశించిన స్థాయి ఓపెనింగ్ వసూళ్లు రాలేదనే చెప్పాలి. ఇక్కడ ఈ సినిమా కొన్ని ప్రాంతాలలో వకీల్ సాబ్ మరియు సర్కారు వారి పాట వంటి ప్రాంతీయ బాషా చిత్రాలను కూడా క్రాస్ చెయ్యలేకపోయింది. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది, టికెట్ రేట్స్ భారీ గా ఉన్నప్పటికీ కూడా కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది.

Written By:
  • Vicky
  • , Updated On : June 17, 2023 / 02:41 PM IST

    Adipurush Collections

    Follow us on

    Adipurush Collections: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ గ్రాండ్ గా విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే భారీ అంచనాల కారణం గా అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరగడం తో ఓపెనింగ్ అదిరిపోయే రేంజ్ లో వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 114 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు సమాచారం.

    కానీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతం లో మాత్రం ఆశించిన స్థాయి ఓపెనింగ్ వసూళ్లు రాలేదనే చెప్పాలి. ఇక్కడ ఈ సినిమా కొన్ని ప్రాంతాలలో వకీల్ సాబ్ మరియు సర్కారు వారి పాట వంటి ప్రాంతీయ బాషా చిత్రాలను కూడా క్రాస్ చెయ్యలేకపోయింది. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది, టికెట్ రేట్స్ భారీ గా ఉన్నప్పటికీ కూడా కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది.

    ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమాకి కేవలం 31 కోట్ల రూపాయిల షేర్ మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చింది. వకీల్ సాబ్ సినిమాకి 33 కోట్ల రూపాయిలు రాగా, మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకి 36 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక సీడెడ్ లాంటి ప్రాంతాలతో అయితే అతి తక్కువ రేట్స్ మీద విడుదలైన భీమ్లా నాయక్ కంటే తక్కువ వసూళ్లు రావడం ప్రభాస్ ఫ్యాన్స్ కి మింగుడు పడనివ్వకుండా చేసింది.

    500 కోట్ల రూపాయిలు ఖర్చు చేసిన సినిమాకి తెలుగు లో వచ్చే ఓపెనింగ్ కాదు ఇది. అది కూడా అందరూ ఎంతో ఇష్టంగా కొలిచే రాముడి జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా అవ్వడం విశేషం.టాక్ సరిగా లేకపోవడం వల్లే ఇదంతా జరిగింది , లేకుండా #RRR ఓపెనింగ్ రికార్డ్స్ సైతం బద్దలు అయ్యేవని అంటున్నారు ట్రేడ్ పండితులు.