Tollywood: టాలీవుడ్ లో కులాంతర వివాహాలు చేసుకున్న హీరోలు

సెలబ్రెటీలు కూడా కులాలకు అతీతంగా పెళ్లి చేసుకుంటున్నారు. మరి ఇలా కులాంతర వివాహాలు చేసుకున్న మన సెలబ్రెటీలు ఎవరో ఓ సారి చూసేద్దాం.

Written By: Neelambaram, Updated On : November 23, 2023 2:56 pm
Follow us on

Tollywood: ఒకప్పుడు పెళ్లంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అనేవారు. ఇంటిని చూసి ఇల్లాలి గురించి అర్థం చేసుకునేవారు. కానీ ప్రస్తుతం లవ్, అట్రాక్షన్ తో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అంతే కాదు పెద్దల వరకు పెళ్లి తంతు రాకుండా కూడా చాలా ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ప్రేమ పెళ్లిళ్లు మాత్రమే కాదు కులాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి. ఇక సెలబ్రెటీలు కూడా కులాలకు అతీతంగా పెళ్లి చేసుకుంటున్నారు. మరి ఇలా కులాంతర వివాహాలు చేసుకున్న మన సెలబ్రెటీలు ఎవరో ఓ సారి చూసేద్దాం.

మహేష్ బాబు-నమ్రత
మహేష్ బాబు నమ్రత పెళ్లి చేసుకొని తమ వైవాహిక జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నారు మహేష్ బాబు చౌదరి వర్గానికి చెందినవారు అయినా కూడా నమ్రత మాత్రం ఉత్తరాది అమ్మాయి కావడం విశేషం. కానీ ఇద్దరు కూడా ఎలాంటి గొడవ లేకుండా ఆదర్శ దంపతులుగా నిలుస్తున్నారు.

రామ్ చరణ్-ఉపాసన
మెగా స్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రామ్ చరణ్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు కానీ ఉపాసన మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. అయితే వీరిద్దరు ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

అల్లు అర్జున్-స్నేహ రెడ్డి
ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. కానీ ఈయన కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్నేహరెడ్డిని పెళ్లి చేసుకున్నారు. వీరు కూడా పెద్దలను ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు.

వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి
మెగా వరుణ్ తేజ్ రీసెంట్ గా లావణ్యను పెళ్లి చేసుకున్నారు. వీరు ఎప్పటి నుంచో ప్రేమలో ఉండి రీసెంట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ స్టార్ హీరో కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే. కానీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన లావణ్యను పెళ్లి చేసుకున్నారు.

మంచు విష్ణు-వెరోనికా
మంచు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మంచు విష్ణు పలు సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన విష్ణు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వెరోనికా పెళ్లి చేసుకున్నారు.

మంచు మనోజ్-మౌనిక
మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూమా మౌనికను రీసెంట్ గా రెండో వివాహం చేసుకున్నారు. ఇక మొదటి వివాహం కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయినే చేసుకున్నారు. వీరిద్దరు విడాకులు తీసుకోవడం తో భూమా మౌనికను పెళ్లి చేసుకున్నాడు మనోజ్.

నాగార్జున: అమల
మొదట దగ్గుబాటి రామానాయుడు కుమార్తెను వివాహం చేసుకున్న మన్మథుడు కొన్ని కారణాల వల్ల ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత హీరోయిన్ అమలను పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిది కూడా కులాంతర వివాహమే..