https://oktelugu.com/

Teacher: తాళి కట్టి.. పెళ్లి అని చెప్పి.. ఆ ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే?

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం తాడేరు గ్రామానికి చెందిన పురేళ్ళ సోమరాజు ఓ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి అక్కడ చదువుతున్న ఒక విద్యార్థినిని నమ్మించాడు.

Written By:
  • Neelambaram
  • , Updated On : November 23, 2023 / 02:48 PM IST
    Follow us on

    Teacher: ఆ విద్యార్థి పై కీచక ఉపాధ్యాయుడు ఎప్పటినుంచో కన్నేశాడు. లోబరుచుకోవడానికి ప్రయత్నించాడు. ప్రేమ పేరుతో నమ్మించాడు. మెడలో తాళి కట్టి.. అదే వివాహంగా నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత నాటకమని చెప్పి చేతులు దులుపుకున్నాడు. దీంతో బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

    పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం తాడేరు గ్రామానికి చెందిన పురేళ్ళ సోమరాజు ఓ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి అక్కడ చదువుతున్న ఒక విద్యార్థినిని నమ్మించాడు. ఈనెల 19న ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని తన స్వగ్రామం తాడేరుకు తీసుకెళ్లాడు. అక్కడే తాళి కట్టి పెళ్లయిందని చెప్పాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

    అటు తరువాత ఆ బాలికను తీసుకొచ్చి ఇంట్లో విడిచిపెట్టాడు. కుటుంబ సభ్యులు గట్టిగా అడిగేసరికి బాధిత బాలిక విషయాన్ని బయటపెట్టింది. దీంతో వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమరాజుపై అత్యాచారం, ఫోక్సో, బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు సమగ్ర దర్యాప్తు కోసం దిశా డిఎస్పి మురళీకృష్ణ నియమిస్తూ జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ ఆదేశాలు జారీ చేశారు.