Homeఎంటర్టైన్మెంట్Star Heroes: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్లుగా ఎదిగిన హీరోలు

Star Heroes: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్లుగా ఎదిగిన హీరోలు

Star Heroes: గోల్డెన్ స్పూన్ తో ప్రతి ఒక్కరు పుట్టలేరు. కానీ చాలా మందికి కోరికలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. వాటిని తీర్చుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు. ఇక సినిమా అంటే పిచ్చితో ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటారు. కానీ వారికి అందరికీ ఈ ఛాన్స్ కష్టమే. అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఇంట్లో ఉంటే.. వారసత్వంగా సినిమా ఇండస్ట్రీ లోకి కూడా ఎంటర్ ఇవ్వచ్చు. బాలనటులుగా కూడా ఎంట్రీ ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే కొన్ని రోజుల పాటు ఇతర కంపెనీలో పని చేసి, లేదా ఉద్యోగాలు చేసి, వ్యాపారాలు మానేసి మరీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారుంటారు.అయితే సినీ ఇండస్ట్రీకి రాకముందు బాలీవుడ్ స్టార్లు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ లిస్ట్ లో షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ఇక ఇండస్ట్రీలోకి రావడం అంత ఈజీ కాదు అనే విషయం తెలిసిందే. మరి ఈ లిస్ట్ లో ఉంది ఎవరో తెలుసా?

అక్షయ్ కుమార్.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. అంత గొప్ప స్థానానికి చేరుకోవడానికి అక్షయ్ కుమార్ చాలా కష్టపడ్డాడు. అక్షయ్ కుమార్ ఇండస్ట్రీకి రాకముందు వెయిటర్ గా చేశారట. అయితే బ్యాంకాక్ ఫుడ్ స్టాల్ లో పనిచేశాడు. మోడలింగ్ లో తన సత్తా చాటాడు. దర్శకుడు ప్రమోద్ చక్రవర్తి తెరకెక్కించిన దీదార్ లో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా 1992లో విడుదలైంది. ఈ సినిమాలోనే కాదు అంతకు ముందు కూడా చాలా సినిమాల్లో నటించారు.

షారుఖ్ ఖాన్.. షారుఖ్ అంటే తెలియని వారుండరు. అమ్మాయిలను మీ డ్రీమ్ బాయ్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు షారుఖ్ ఖాన్. ఈ మధ్య ఏమైందో కానీ.. షారుఖ్ సినిమాల్లో కనిపించలేదు. అలా నాలుగేళ్ల తర్వాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ స్టార్ హీరో కూడా ఇండస్ట్రీలోకి రాకముందు టికెట్స్ సేల్స్ మెన్ గా పనిచేశాడని టాక్..అప్పుడు కేవలం రూ. 50 మాత్రమే తీసుకున్నారంటే నమ్ముతారా? కానీ అదే ఆయన రెమ్యూనరేషన్.
అయితే హీరోగా ఛాన్స్ ఇచ్చింది మాత్రం హేమమాలిని అని చెప్పడంలో సందేహం లేదు. ఆమె డైరెక్షన్ చేసిన దిల్ ఆష్నా హై సినిమా.. కొన్ని కారణాల వల్ల రిలీజ్ లేటయింది. సెకండ్ ఛాన్స్ గా దీవానా లో ఆఫర్ వచ్చింది. రిషి కపూర్, దివ్యభారతిలతో పాటు సపోర్టింగ్ రోల్ అది. ఆ సినిమాతోనే షారుఖ్ లైఫ్ టర్న్ అయింది.

వాజుద్దీన్ సిద్దిఖి..బాలీవుడ్ ఇండస్ట్రీలో నవాజుద్దీన్ సిద్దిఖీ తన టెరిఫిక్ యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక ఈయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేకంటే ముందు ఏం పని చేశారో ఎవరికి తెలియదు. కానీ కొన్ని వార్తల ప్రకారం ఈయన సెక్యూరిటీగా పని చేశారని టాక్.

రజినీకాంత్..సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ హీరో అభిమానులు ఫుల్ అనే చెప్పాలి. ఈయన కూడా ఎన్నో కష్టాలు పడిన తర్వాతనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈయన సినిమాలోకి రాకముందు బస్సు కండక్టర్ గా పనిచేసేవారట.

దిలీప్ కుమార్.. ప్రస్తుతం దిలీప్ కుమార్ మన మధ్య లేరు అనే విషయం బాధాకరం. కానీ ఆయన జ్ఞాపకాలు ఎంతో మంది ప్రేక్షకుల గుండెల్లో పదిలంగానే ఉన్నాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన సినిమాల్లోకి రాకముందు పండ్లు అమ్మేవారు అని సమాచారం.

అమితాబ్ బచ్చన్.. బాలీవుడ్ కింగ్, బాలీవుడ్ మెగాస్టర్ అంటే అమితాబ్ బచ్చన్ పేరు చెప్తారు. దాదాపు 50 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆయన. ఇప్పటికి అమితాబ్ బచ్చన్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూడటం విశేషం. ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు ఆయన కోల్ కతా లో ఒక షిపింగ్ కంపెనీలో పని చేసారని సమాచారం. ఈయన నిర్మాత కూడా.అంతేకాదు రాజకీయ నాయకుడు, టెలివిజన్ హోస్ట్ గా హిందీ చిత్రాలలో పని చేశారు. అతను 1969లో సాత్ హిందూస్తానీతో నటుడిగా అరంగేట్రం చేశాడు. అంతేకాదు మొదట్లోనే మృణాల్ సేన్ భువన్ షోమ్ కి కథ అందించారు కూడా.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Oktelugu Epaper
Exit mobile version