తొలి వారం లోనే 23 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన చిత్రం గా సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ కి ప్రముఖ హీరో విశ్వక్ సేన్ కి మధ్య ఇండస్ట్రీ లో పెద్ద గొడవ జరుగుతుందని తెలుస్తుంది. నిన్న విశ్వక్ సేన్ కూడా సాయి రాజేష్ ని ఉద్దేశిస్తూ వేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఇక అసలు విషయానికి వస్తే నిన్న ‘బేబీ’ చిత్రానికి సంబంధించి ఒక సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ సక్సెస్ మీట్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. అయితే ఈ సినిమా చేసే ముందు సాయి రాజేష్ ఎలాంటి అవమానాలను ఎదురుకున్నాడో చెప్పుకున్నాడు.
ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నటించడానికి నన్ను నమ్మినందుకు ఆనంద్ దేవరకొండ కి కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా ని నేను ముందుగా ఒక హీరో తో చేద్దాం అనుకున్నాను. ఆ హీరో కి వాళ్ళ మ్యానేజర్ ఫోన్ చేసి ఇలా ఒక మంచి లవ్ స్టోరీ ఉంది, SKN దానికి నిర్మాత, ఆ కథని డైరెక్టర్ మారుతీ గారు కూడా విన్నారు, సాయి రాజేష్ దర్శకుడు అని అన్నాడు. సాయి రాజేశా?, ఆదితో నేను అసలు సినిమా చెయ్యను అని కనీసం స్టోరీ కూడా వినలేదు’ అని ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు. దీనికి విశ్వక్ సేన్ నిన్న రాత్రి నవ్వుతూ ఎమోజిలు పెట్టాడు ట్విట్టర్ లో.