Vishal- Abhinaya: తెలుగువాడైన విశాల్ కోలీవుడ్ లో స్టార్ గా ఎదిగాడు. తనకంటూ ఒక ఇమేజ్, మార్కెట్ సొంతం చేసుకున్నారు. తెలుగులో కూడా విశాల్ కి గుర్తింపు ఉంది. ఆయన నటించిన ప్రేమ చదరంగం, పందెంకోడి, భరణి, వాడు వీడు చిత్రాలు ఇక్కడ మంచి విజయాలు సాధించాయి. విశాల్ నిర్మాత కూడాను. కాగా విశాల్ కెరీర్లో అనేక ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నారు. శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మీతో విశాల్ చాలా కాలం ఎఫైర్ నడిపారు. దాదాపు పెళ్లి వరకు వీళ్ళ వ్యవహారం వెళ్ళింది. కారణం తెలియదు కానీ ఘాడమైన ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టారు.

విశాల్ అంటే వరలక్ష్మీ పేరెంట్స్ కి అసలు నచ్చదు. నడిగర్ సంఘం ఎన్నికల విషయంలో విశాల్ ని తీవ్ర స్థాయిలో శరత్ కుమార్, రాధిక విమర్శించారు. వరలక్ష్మీకి గుడ్ బై చెప్పాక నటి లక్ష్మీ మీనన్ కి దగ్గరయ్యాడు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు త్వరలో పెళ్లి అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూసింది. ఈ వార్తలను లక్ష్మీ మీనన్ ఖండించారు. పాండియ నాడు, నాన్ సిగప్పు మణితన్ చిత్రాల్లో విశాల్ కి జంటగా లక్ష్మీ మీనన్ నటించారు.
అనంతరం హైదరాబాద్ కి చెందిన అనిషా అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ సంబంధం క్యాన్సిల్ అయ్యింది. తాజాగా నటి అభినయతో విశాల్ ఎఫైర్ నడుపుతున్నారంటూ కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. హీరోల చెల్లి పాత్రలు చేసే అభినయకు మాట, వినికిడి సమస్య ఉంది. తెలుగులో అభినయ సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, ధృవ, సీతారామం వంటి హిట్ చిత్రాల్లో నటించారు. రవితేజ నేనింతే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు.

ప్రస్తుతం విశాల్ హీరోగా తెరకెక్కుతున్న మార్క్ ఆంటోని చిత్రంలో అభినయ నటిస్తున్నారు. ఈ మూవీలో అభినయ విశాల్ కి భార్యగా కనిపించనున్నట్లు సమాచారం. విశాల్ తో ఎఫైర్ రూమర్స్ పై అభినయ స్పందించారు. జరుగుతున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని తెలియజేశారు. ఆయనతో కలిసి నటించినంత మాత్రానా ఇలాంటి పుకార్లు సృష్టిస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. కాగా విశాల్ లేటెస్ట్ మూవీ లాఠీ విడుదలకు సిద్దమవుతుంది.