Celebrities Extramarital Affairs: సినీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి నటులు అనేక వేషాలు వేయాల్సి ఉంటుంది. ఈ ప్రభావం వారి రియల్ లైఫ్ పై కూడా పడుతుంది. సినిమాల్లో లాగే కొందరు భాగస్వామి ఉండగానే మరొకరితో ప్రేమాయణం కొనసాగిస్తారు. వారి ప్రేమలో పడి పరితపించిపోతారు. కొందరు ఒకడుగు ముందుకేసి శారీరకంగా కలిసి వివాహేతర సంబంధాలను కొనసాగిస్తారు. ఆ తరువాత కొందరు రెండో వివాహం చేసుకుంటే.. మరికొందరు అక్కడినే పులిస్టాప్ పెట్టి వారితో లివింగ్ రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారు. నాటి నుంచి నేటీ వరకు చాలా మంది ప్రముఖులు ఈ కోవకు చెందిన వారే అలాంటి వారు ఎవరో చూద్దాం.

సినిమా ఇండస్ట్రీ వాళ్ల పెళ్లిళ్లు నిలకడగా ఉండవు. ప్రేమలో పడినంత ఈజీగా.. విడాకులు తీసుకుంటారు. అయితే కొందరు అన్యోన్యంగా జీవిస్తున్నా.. వారిని కాదని మరొకరితో సంబంధాలు పెట్టుకుంటారు. ఈ విషయం తెలిసినా వారి భాగస్వాములు లైట్ గా తీసుకుంటారు. కొందరు నచ్చక విడాకులు తీసుకుంటారు. అయితే భార్య ఉండగానే మరొకరితో ఎఫైర్ పెట్టుకున్న హీరోలు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఉన్నారు.
నరేశ్-పవిత్రా లోకేశ్:
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా కొనసాగుతున్న నరేశ్-పవిత్ర లోకేశ్ ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్. నరేశ్ కు అంతకుముందే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఇప్పుడు మరో నటి పవిత్రా లోకేశ్ తో నాలుగో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అటు పవిత్రా లోకేశ్ కు కూడా భర్త, పిల్లలు ఉన్నారు.

అమితాబ్ బచ్చన్ -రేఖ:
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్-జయా బచ్చన్ లు భార్యభర్తలు. కానీ అమితాబ్ పై రేఖకు ఎప్పటి నుంచో మనసు ఉంది. వీరుకలిసి కొన్ని సినిమాల్లో నటించారు కూడా. కానీ అమితాబ్ మాత్రం రేఖను పెళ్లి చేసుకోలేదు. కానీ వీరి వ్యవహారం కొంతకాలం సాగింది.

శత్రుజ్ఞ సిన్హా-రీనారాయ్:
సినీ యాక్టర్ గా పోలిటికల్ లీడర్ గా శత్రుజ్ఞ సిన్హా ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. ఎన్నో సినిమాల్లో నటించిన ఆయనకు రీనా రాయ్ తో ప్రేమాయణం సాగింది.కానీ అంతకుముందు పూనమ్ సిన్హా ను పెళ్లి చేసుకున్నారు. పూనమ్ రాయ్ తోప్రేమాయణం సాగినా వీరి ప్రేమకు బ్రేకులు పడ్డాయి.

మిథున్ చక్రవర్తి -శ్రీదేవి:
బాలీవుడ్లో ఒకప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తి. ఇప్పటికీ కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరిస్తున్న ఆయన పర్సనల్ లైఫ్ లో ఇద్దరిని వివాహం చేసుకున్నారు. 1979లో హిలెనా లుకేను పెళ్లి చేసుకున్నారు. అదే సంవత్సరం ఆమెతో విడాకులు తీసుకున్నారు. అయితే మళ్లీ యోగితా బాలిని మనువాడారు. ఈ క్రమంలో ఆయన శ్రీదేవితో సినిమాలు ఎక్కువగా చేయడంతో ఆమెపై మనసు పారేసుకున్నాడు.

ఆదిత్యా పంచోలి-కంగనా రానౌత్:
టీవీ యాక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఆదిత్యా పంచోలి ఆ తరువాత సినీ నిర్మాతగా ఎదిగిపోయారు. ఆయన 1986లో జరీనా వాహబ్ ను పెళ్లి చేసుకున్నారు. కానీ సినిమాల్లో నటిస్తున్న సమయంలో కంగానా రానౌత్ తో చనువు పెంచుకున్నారు.

హృతిక్ రోషన్- బార్బరా మోరి:
కండలు తిరిగిన నటుడిగా పేరున్నహృతిక్ రోషన్ కు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ఆయనకు 2000 సంవత్సరంలో సుజానేతో వివాహం అయింది. అయినా హృతిక్ రోషన్ బార్బరా మోరితో అక్రమ సంబంధం ఉన్నట్లు వార్తలొచ్చాయి.

గోవిందా -రాణి ముఖర్జీ:
మల్టీపుల్ యాక్టింగ్ చేసే గోవిందా అంటే అందరికీ అభిమానమే. ఆయనకు సునీతా ఆహుజాతో 1987లో వివాహం అయింది. అయితే సినిమాల్లో నటించిన రాణి ముఖర్జీతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించారని అంటారు.

బోనికపూర్-శ్రీదేవి:
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అయిన బోనీ కపూర్, మోనా కపూర్ భార్యభర్తలు. అయితే శ్రీదేవితో బోనీ కపూర్ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. ఆ తరువాత పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ శ్రీదేవి ఆకస్మికంగా మరణించింది.

అమీర్ ఖాన్ -కిరణ్ రావు:
విలక్షణ నటుడు అమీర్ ఖాన్ కు జీవితంలో మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఆయన మొదటి భార్య రీనా దత్తుతో అన్యోన్యంగా ఉన్న సమయంలో కిరణ్ రావుతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నారు.. ఆ తరువాత వివాహం చేసుకున్నారు.

అర్జున్ కపూర్- మలైకా అరోరా:
బాలీవుడ్ స్టార్ నటి మలైకా అరోరా అంటే తెలియని వారుండరు. ఆమె 1998లో అర్భజ్ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత 2017లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం అర్జున్ కపూర్ తో లివింగ్ రిలేషన్ షిప్ ను కొనసాగిస్తున్నారు.
