Samantha- Akkineni Heroes: సమంతకు ‘వయోసిటీస్’వ్యాధి గురించి తెలియగానే సినీ ఇండస్ట్రీ షాక్ తింటోంది. ఈ వ్యాధి నుంచి కోలుకోవాలని సినిమా పరిశ్రమకు చెందిన వారు సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి నటులు మోటివేషన్ పోస్టు పెట్టి ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఈ తరుణంలో సమంత అనారోగ్యంతో ఉందని తెలియగానే అక్కినేని కుటుంబం నుంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కినేని అఖిల్ సమంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే తాజాగా సీనియర్ నటుడు నాగార్జున ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సమంత కోసం ఆ పని చేయబోతున్నాడట.

తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది. నిత్యం ఏదో ఒక పోస్టుతో యాక్టివ్ గా ఉండే ఈ భామకు ఏమైంది..? అని కొందరు రకరకాల పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో వారి సందేహాన్ని తీర్చేందుకు సమంత షాకింగ్ ఫొటో పెట్టి పోస్టు చేశారు. తనకు ‘వయోసిటీస్’ వ్యాధి తీవ్రమైందని, అందుకోసం రెస్ట్ తీసుకుంటున్నట్లు సెలైన్ ఎక్కుతున్న బాటిల్ తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. దీంతో ఆమెకు వచ్చిన వ్యాధిపై సినీ ఆడియన్స్ అంతా కంగారయ్యారు.
ఈ క్రమంలో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆమెకు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు సోషల్ మీడియా వేదికగా సమంత కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఫోన్ చేసి ఆమె క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ పాత విషయాలన్నీ మరిచిపోయి అక్కినేని అఖిల్ ముందుగా స్పందించారు. సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ పోస్టు ఇన్ స్టాలో వైరల్ అవుతోంది.

తాజాగా సమంత మాజీ మామ, సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.ఫోన్లో, సోషల్ మీడియాలో కాకుండా నేరుగా కలిసి మాట్లాడాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాల్లోనే కాకుండా రియల్ గా కూడా నాగ్, సమంతలో బంధువులు. ఇప్పుడు విడిపోయినా తమ సొంత వాళ్లు ప్రమాదంలో ఉండే కలుకోకుండా ఉండలేరు కదా… అందుకే నాగార్జున నేరుగా సమంతను కలిసి పరామర్శించాలని అనుకుంటున్నాట. అయితే అధికారికంగా మాత్రం తెలియడం లేదు. మరి ఈ వార్తలపై నాగార్జున ఎలా రియాక్టవుతారో చూడాలి..