Homeఎంటర్టైన్మెంట్Venu Thottempudi: ఉవ్వెత్తున ఎగసి క్రింద పడిన కెరటం.... హీరో వేణు కెరీర్ బాధాకరం!

Venu Thottempudi: ఉవ్వెత్తున ఎగసి క్రింద పడిన కెరటం…. హీరో వేణు కెరీర్ బాధాకరం!

Venu Thottempudi:  ఆరున్నర అడుగుల తెలుగు కుర్రాడు తొట్టెంపూడి వేణు… రావడంతోనే సక్సెస్ అందుకున్నారు. 1999లో విడుదలైన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ స్వయంవరం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కొత్త హీరో అయినా… సపరేట్ మేనరిజంతో వేణు అలరించారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. స్వయంవరం సినిమాతో మరో తెలుగు అమ్మాయి లయ హీరోయిన్ గా పరిచయం అయ్యారు.

Venu Thottempudi
Venu Thottempudi

మొదటి చిత్రం విజయం నేపథ్యంలో వేణుకు అవకాశాలు క్యూ కట్టాయి. చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు వంటి హిట్ చిత్రాలు ఆయనకు ఓ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. సోలో హీరోగా సక్సెస్ అవుతూనే మల్టీస్టారర్స్ కూడా చేశారు వేణు. హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే, శ్రీకృష్ణ 2006, ఖుషీ ఖుషీగా.. ఈ తరహా చిత్రాలే. ఒక దశలో వేణు టూ టైర్ హీరోగా ఇండస్ట్రీలో సెటిల్ అవుతాడని అందరూ భావించారు. అయితే ఇండస్ట్రీలో కెరీర్ ని డిసైడ్ చేసేది కేవలం విజయాలే.

Also Read: ‘వయ్యా సామి’ అంటూ హావ‌భావాల‌తో ఉర్రూత‌లూగించిన సింగ‌ర్ భర్త ఎవరో తెలిస్తే..!

కళ్యాణ్ రాముడు, పెళ్ళాం ఊరెళితే చిత్రాల తర్వాత వేణుకు సరైన హిట్స్ దక్కలేదు. ఈ క్రమంలో ప్రయోగాలు చేసినా ఫలితం ఇవ్వలేదు. వరుస ప్లాప్స్ తో వేణు కెరీర్ ప్రమాదంలో పడింది. ఆయనకు సినిమా అవకాశాలు తగ్గాయి. దర్శక నిర్మాతలు వేణును పక్కన పెట్టారు. కెరీర్ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో గోపి గోపిక గోదావరి వంటి మంచి ఆఫర్ దక్కింది.

ప్రముఖ దర్శకుడు వంశీ చిత్రం కావడంతో ఈ మూవీతో వేణు కమ్ బ్యాక్ కావచ్చని అందరూ భావించారు వంశీ మార్కు కామెడీ, రొమాన్స్ తో గోపి గోపిక గోదావరి చిత్రం తెరకెక్కింది. చక్రి అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. పర్వాలేదు అనిపించుకున్న ఈ చిత్రం కమర్షియల్ గా ఆడలేదు. వేణు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఈ మూవీ తర్వాత వేణుకు హీరోగా దారులు పూర్తిగా మూసుకుపోయాయి.

చింతకాయల రవి మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వేణు… ఆ మూవీలో క్యామియో రోల్ చేశారు. ఎన్టీఆర్ హీరోగా బోయపాటి తెరకెక్కించిన దమ్ము మూవీలో సపోర్టింగ్ రోల్ చేశాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగే పనిలో ఉన్నారు.

శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ మూవీలో ఆయన కీలక రోల్ చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. హీరోగా సక్సెస్ లు చూసిన వేణు పునాది వేసుకోవడంలో విఫలం చెందాడు. సినిమా ఎంపికలో తడబడిన వేణు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. కనీసం వేణు సెకండ్ ఇన్నింగ్స్ అయినా సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుకుందాం.

Also Read: విజయవాడకు వంగవీటి పేరు పెడతారా?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper