https://oktelugu.com/

Tollywood: ఈ హీరో ఒకప్పుడు మహేష్ బాబు కంటే స్టార్ హీరో కానీ ఇప్పుడు సినిమాలు లేకుండా ఖాళీ ఉంటున్నాడు…ఇంతకీ ఎవరతను..?

తెలుగు లో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ ఇక్కడ కొందరికి మాత్రమే మంచి గుర్తింపు లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే సినిమాలే ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తూ ఉంటాయి...

Written By:
  • Gopi
  • , Updated On : August 23, 2024 / 11:20 AM IST

    Tollywood

    Follow us on

    Tollywood: సినిమా ఇండస్ట్రీ ఎవరు ఏ రోజు ఏ పొజిషన్లో ఉంటారు అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారే రేపు అవకాశాలు లేక క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయే పరిస్థితులు కూడా రావచ్చు. ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్న వారే రేపు స్టార్ హీరోలుగా కూడా ఎదిగి ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి ఇండస్ట్రీ అనేది ఎప్పుడు శాశ్వతం కాదు. ఒకప్పుడు లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో తరుణ్… ఈయన మహేష్ బాబు కంటే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక మహేష్ బాబుకి సూపర్ హిట్లు లేని సమయంలో ఆయనకు దాదాపు రెండు నుంచి మూడు సూపర్ హిట్ల ను అందుకొని మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే ఆ హీరో ఫ్యూచర్ లో స్టార్ హీరోగా ఇండస్ట్రీ ని ఎలుతాడు అని అందరూ అనుకున్నారు.

    కానీ కట్ చేస్తే ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఫేడ్ అవుట్ అయిపోయాడు. కానీ మహేష్ బాబు మాత్రం వరుసగా సక్సెస్ లను అందుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం పాన్ వరల్డ్ లో స్టార్ హీరోగా ఎదిగే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పొజిషన్ అనేది శాశ్వతం కాదు. ఒక సినిమాతో ఇండస్ట్రీ హిట్టు కొడితే మరొక హీరో వచ్చి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఉంటాడు. అందువల్లే ప్రతి ఒక్కరు ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళితే మంచిది.

    అలా కాకుండా నన్ను మించిన వారు ఎవరు లేరు అనే ఒక గర్వంతో ముందుకెళ్తే మాత్రం చాలా అనర్ధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కోసం మేకోవర్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాలో రెండు నుంచి మూడు గెటప్పుల్లో మహేష్ బాబు కనిపించబోతున్నాడట. దానికోసమే ఆ గెటప్ లకు సంబంధించిన లుక్కులను రాజమౌళి పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ప్రస్తుతానికైతే మహేష్ బాబు ఒక పోనీ టేల్ హెయిర్ స్టైల్ తో, కొంచెం హెవీ గడ్డంతో ఒక లుక్కులో మనకు కనిపిస్తున్నాడు. మరి ఈ లుక్కు తర్వాత మరొక లుక్ ని కూడా రాజమౌళి ప్రిఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ షూట్ ఉన్నప్పుడు అలాంటి లుక్ లోకి మారిపోవాల్సిన అవసరమైతే ఉంది. కాబట్టి మహేష్ బాబు ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఈ ఒక్క సినిమాతో ఆయన సక్సెస్ ని సాధిస్తే మాత్రం వరల్డ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం మహేష్ బాబుకి సలాం చేస్తుందనే చెప్పాలి…