https://oktelugu.com/

NTR: డ్రాగన్ సినిమాలో ఎన్టీయార్ పాత్ర ఏంటో చెప్పేసిన ప్రశాంత్ నీల్…మళ్ళీ డార్క్ మూడ్ లోనేనా..?

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలకు టాప్ డైరెక్టర్ల తో సినిమా చేయాలనే కుతూహలం ఉంటుంది. ఇక అభిమానులు కూడా వాళ్ళ కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి కాంబినేషన్ కి ఎక్కడలేని గుర్తింపు కూడా వస్తుంది. అందుకే వాళ్ళు చేయబోయే సినిమాతో తమను తాను ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశ్యం తో కష్టపడి ఆ సినిమాను తెరకెక్కిస్తూ ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : August 23, 2024 / 11:32 AM IST

    NTR

    Follow us on

    NTR: ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క అభిమాని ఈ సినిమా కోసం ఎదురుచూడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ గా కూడా ప్రతి ఒక్కరు అభివర్ణిస్తున్నారు. నిజానికి ప్రశాంత్ నీల్ కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం..అందుకే తన డ్రీమ్ ప్రాజెక్టు ను కూడా ఎన్టీఆర్ తో చేయాలని అనుకుంటున్నట్టుగా గతంలో ఆయన పలు సందర్భల్లో తెలియజేశాడు. అలాంటి ఒక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు అనగానే యావత్ ఇండియన్ ప్రేక్షకులందరు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేయడమే కాకుండా ఎన్టీఆర్ ని స్టార్ హీరోగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తుందనే కామెంట్లైతే వస్తున్నాయి.

    నిజానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. అంటే అది హై యాక్షన్ అండ్ ఎమోషనల్ సినిమాగా తెరకెక్కుతుంది. ఇక తను గతంలో చేసిన కేజిఎఫ్, సలార్ లాంటి సినిమాలు కూడా అందుకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని ఒక గొప్ప క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది.

    ముఖ్యంగా ఎన్టీఆర్ ఒక వారియర్ గా కనిపించబోతున్నాడు అంటూ రీసెంట్ గా కన్నడ మీడియా నుంచి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. నిజానికి ప్రశాంత్ నీల్ తీసే సినిమాల్లో హీరో ఒక వారియర్ గానే కనిపిస్తాడు. తన వాళ్ళ కోసం ఎదుటివారితో యుద్ధం చేసే క్యారెక్టర్ లో హీరో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. కాబట్టి ఈ సినిమాని కూడా అలాంటి ఒక కాన్సెప్ట్ తోనే తెరకెక్కిస్తున్నారు అంటూ విపరీతమైన కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇక తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఒక డార్క్ మూడ్ లో ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

    ఇక ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్కుని రిలీజ్ చేసిన ప్రశాంత్ నీల్ ఆ లుక్కుని చూస్తేనే మనకు ఇదొక డార్క్ మూడ్ లో ఉండబోతుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది… ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ‘సలార్ 2’ సినిమాని అలాగే యశ్ తో ‘కేజిఎఫ్ 3’ సినిమాను కూడా పట్టాలెక్కించనున్నట్టుగా తెలుస్తుంది.