Sumanth: సినీ సెలబ్రిటీలతో అత్యధిక ఫ్యాన్స్ ఉన్న హీరోల్లో ఒకరు పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan). యంగ్ జనరేషన్ హీరోలందరూ దాదాపుగా ఆయన అభిమానులం అని చెప్పుకుంటూ ఉంటారు. కిరణ్ అబ్బవరం,నితిన్, సందీప్ కిషన్, నిఖిల్ సిద్దార్థ్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంటుంది. అయితే ఒక్క సెలబ్రిటీ మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నేను మాత్రం మహేష్ బాబు(Superstar Mahesh Babu) వీరాభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు. ఆ హీరో మరెవరో కాదు, సుమంత్(Sumanth Akkineni). మీ అభిమాన హీరో ఎవరు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సుమంత్ సమాధానం చెప్తూ ‘నేను అక్కినేని ఫ్యామిలీ కి చెందిన వాడిని. సేఫ్ గా నాగార్జున అభిమానిని అని చెప్పుకోవచ్చు. కానీ నేను అలా చెప్పను. మా నాగార్జున గారిని పక్కన నిలబెట్టినా కూడా నేను మహేష్ బాబు పేరే చెప్తాను. కొంతమంది పవన్ కళ్యాణ్ ఇష్టమా, మహేష్ బాబు ఇష్టమా అని కూడా సోషల్ మీడియా లో అడిగేవారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నేను మహేష్ బాబు ఫ్యాన్ ని చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చాడు సుమంత్.
ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. అక్కినేని వంశం నుడి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుమంత్, తన మొదటి సినిమా నుండే కొత్త తరహా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని సప్రైజ్ కి గురి చేసే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఆ ప్రయత్నం లో వరుసగా ఆయనకు హిట్స్ వచ్చాయి. ఒకానొక దశలో స్టార్ హీరో కూడా అయిపోతాడేమో అనుకున్నారు. కానీ ఆ తర్వాత వరుసగా ఫ్లాప్స్ రావడంతో కెరీర్ మళ్లీ డౌన్ అయిపోయింది. కొంతకాలం సినిమాలకు దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి సెలెక్టివ్ గా హీరోగా కొన్ని సినిమాలు చేస్తున్నాడు, అదే విధంగా కథ నచ్చితే క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా సినిమాలు చేస్తున్నాడు. మొత్తం మీద సుమంత్ కెరీర్ ప్రస్తుతానికి విజయవంతంగానే సాగుతోంది, చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉండబోతోంది అనేది.