Adire Abhi : జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయిన కమెడియన్స్ లో ఒకరు అదిరే అభి. అంతకు ముందు అభి పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో నటించాడు కానీ, ఆయన్ని ఆడియన్స్ గుర్తించింది మాత్రం జబర్దస్త్ షో ద్వారానే. ఒక పెద్ద MNC కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే అభికి, అనుకోకుండా జబర్దస్త్ లో అవకాశం రావడం, చిన్న తనం నుండి నటన పై ప్రత్యేక ఆసక్తి ఉండడం తో అభి తన ఉద్యోగాన్ని వదిలి ఈ రంగం లోకి అడుగుపెట్టడం జరిగింది. అప్పట్లో అదిరే అభి టీం స్కిట్స్ అదిరిపోయేవి. కేవలం తానూ మాత్రమే ఎదగడం కాకుండా, ఎంతో మంది కమెడియన్స్ ని ఇండస్ట్రీ లోకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కమెడియన్స్ లో ఒకరైన హైపర్ ఆది ని జబర్దస్త్ షో ద్వారా ఆడియన్స్ కి పరిచయం చేసింది అభి నే.
అదే విధంగా టేస్టీ తేజ, ఇమ్మానుయేల్, వర్ష ఇలా ఎంతో మంది కమెడియన్స్ ని ఆయన ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. వీళ్లంతా ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే అభి తక్కువ స్థాయిలోనే ఉన్నాడు. ఆ రేంజ్ సక్సెస్ ని చూడలేదు. ఇదంతా పక్కన పెడితే డైరెక్టర్ అనిల్ రావిపూడి అదిరే అభి కి బెస్ట్ ఫ్రెండ్ అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?. నేడు అనిల్ రావిపూడి కామిక్ టైమింగ్ ఈ రేంజ్ లో ఉందంటే, అందుకు అదిరే అభి కూడా ఒక కారణం అట. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. రీసెంట్ గానే ఆయన రాజ్ తరుణ్ ని హీరో గా పెట్టి ‘చిరంజీవ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథి గా హాజరైన అనిల్ రావిపూడి, అభి గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘ఇన్ని రోజులు అభి గురించి మాట్లాడే అవకాశం నాకు రాలేదు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఫంక్షన్ కి వచ్చి ఆయన గురించి మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించింది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నా మొదటి సినిమా గౌతమ్ SSC. ఆ సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాను, అభి అందులో మంచి క్యారక్టర్ చేసాడు. ఆ సినిమా షూటింగ్ సమయం లో మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. మా ప్రయాణం అలా 2011 వరకు కొనసాగింది. అప్పట్లో నా స్టోరీ డిస్కషన్స్ కి కూడా అభి వచ్చే వాడు. కందిరీగ సినిమాలో , హీరోయిన్ అక్ష కి తెలంగాణ మాండలికం లో డైలాగ్స్ రాయాల్సి వచ్చింది నాకు. నాకు పెద్దగా తెలంగాణ మాండలికం తెలియదు. ఆ సమయం లో నాకు అభి చాలా సహాయం చేసాడు. ఆయన వల్లే నా రైటింగ్ స్కిల్స్ కూడా పెరిగాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.
