MAA Election: సుదీర్ఘ చర్చ అనంతరం ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు మీడియా సమావేశంలో అనేక విషయాలు వెల్లడించారు. ఈ సంధర్భంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన సభ్యులందరూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఎలక్షన్స్‌లో అవకతవకలు జరిగాయని, రౌడీయిజం చేశారని పేర్కొన్నారు ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ… విష్ణు తమ్ముడు లాండివాడని అన్నారు. నరేశ్ మా ఎలక్షన్స్‌ను వెనకుండి నడిపించాడని చాలా బాగా అర్థమవుతోందని తెలిపారు.
ఒకే ప్యానెల్ సభ్యులు అధికారంలో ఉంటే బాగుంటుందని భావించి.. తమ సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. మేము తప్పు చేశాని అనుకున్నా ఫర్వాలేదని శ్రీకాంత్ అన్నారు. విష్ణు మ్యానుఫెస్టోకు ఎలాంటి ఇబ్బంతి కలగకూడదనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తమని నమ్మి గెలిపించిన సభ్యులందరికి క్షమాపనలు కోరుతున్నట్లు శ్రీకాంత్ తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో నైనా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు శ్రీకాంత్.
అదే విధంగా బెనర్జీ , ఉత్తేజ్ లను తీవ్ర పద జాలంతో నరేశ్ ధూషించారని … బెనర్జీ పై మోహన్ బాబు ప్రవర్తించిన తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బెనర్జీ , ఉత్తేజ్ కంటతడి పెట్టుకోడవం అందర్నీ కలిచివేసింది.
‘మా’ అధ్యక్ష పదవికి మంచు విష్ణుతో పోటీపడి ప్రకాశ్‌రాజ్ ఓడిపపోయిన సంగతి తెలిసిందే. మొత్తం 18 కార్యవర్గ సభ్యుల్లో 10 మంది విష్ణు ప్యానెల్‌కు చెందిన అభ్యర్థులు విజయం సాధించగా… 8 మంది ప్రకాశ్‌రాజ్ అభ్యర్థులు గెలుపొందారు. ఇటీవల ప్రాంతీయవాదం, జాతీయ వాదం నేపథ్యంలోనే ఈ ఎన్నికలు సాగాయని పేర్కొంటూ ప్రకాశ్ రాజ్… విష్ణు గెలుపును స్వాగతించినట్లు తెలిపారు.