
Mohan Babu Comments: ‘మా’ ఎన్నికల్లో నటుడు బెనర్జీ పై మోహన్ బాబు వృద్ధ సింహంలా గర్జించారు. ఎందుకు గొడవ అని అడిగినందుకు బెనర్జీ పై మోహన్ బాబు విరుచుకు పడ్డారు. ఎక్కువ చేస్తే చీరేస్తా అంటూ రెచ్చిపోయారు. మధ్యలో ఆపడానికి వచ్చిన ఓ నటుడు పై కూడా మోహన్ బాబు సీరియస్ అయ్యాడు. అయితే ఈ క్రమంలో మోహన్ బాబు బూతులకు బెనర్జీ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ప్యానెల్ పెట్టిన ప్రెస్ మీట్ లో బెనర్జీ ఈ విషయం గురించి మాట్లాడారు. ముఖ్యంగా బెనర్జీ కన్నీళ్లు పెట్టుకుంటూ.. ‘తనీష్ పై మోహన్ బాబు(Mohan Babu Comments) సీరియస్ అవుతుంటే.. నేను ఎందుకు అండి గొడవ ? అని అడిగాను. దాంతో అరగంట పాటు మోహన్ బాబు గారు నన్ను అమ్మ నా బూతులు తిట్టారు’ అని బెనర్జీ బాధను కంట్రోల్ చేసుకుంటూ.. ‘నేను ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను, అలాంటిది నన్ను అందరి ముందు మోహన్ బాబు బూతులు తిడుతూ అవమానించారు.
మూడు రోజులుగా నాలో నేను లేను. మోహన్ బాబు గారు నన్ను పచ్చి బూతులు తిట్టడం, మూడు రోజుల నుంచి చాలా బాధపడుతున్నాను. ఇలా ఎందుకు బతకాలి నేను ? ఇలాంటి అసోసియేషన్‌లో నేను ఎందుకు ఉండాలి ?’ అని బెనర్జీ ఎమోషనల్ అవుతూ మాట్లాడటం అందర్నీ కలిచివేసింది. బెనర్జీ ఇలా ఎమోషనల్ అవ్వడం పై ప్యానెల్ సభ్యులు కూడా జీర్ణయించుకోలేకపోతున్నారు.
ఏది ఏమైనా ‘మా’ లో ముదిరిన గందరగోళం కారణంగా మోహన్ బాబు ఇలా ప్రవర్తించడం పై విమర్శలు వస్తున్నాయి. అలాగే సీనియర్ నటుడు నరేష్ పై కూడా ప్రకాష్ రాజ్ బృందం విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఉద్రిక్తతలకు, గొడవలకు ప్రధాన కారణం నరేషే అంటూ ప్రకాష్ రాజ్ సభ్యులు ఆరోణలు చేశారు. మరి మంచు విష్ణు ప్యానల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.