Mohan Babu: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘మాది అంతా ఒకే కుటుంబం. అందరం కలిసే ఉంటాం’ అంటూ చెప్పుకొచ్చిన సభ్యులు మళ్ళీ మాట మార్చారు. ఎన్నికల సమయంలో అనుకున్న మాటలు ఇంకా కోపాన్ని రగిలిస్తూనే ఉంది. దాంతో ‘మా’ కుటుంబం ముక్కలు అయిందనే అనుకోవాలి. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లో గెలిచిన సభ్యులూ ‘మా’ని వీడతడానికి రెడీ అయ్యారు. అయితే బయట నుంచి పని చేస్తాం అని చెబుతున్నారు.
మొత్తానికి ‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయవాదం ప్రచారాస్త్రంగా మంచు విష్ణుగెలిచాడు. దాంతో ప్రాంతీయవాదం ఉన్న ‘మా’లో తాము కొనసాగలేమని అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి సినీ నటుడు నాగబాబు రాజీనామా చేశాడు. ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు మొత్తం ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి.. ఎమోషనల్ స్పీచ్ లు ఇచ్చారు.
ఇక ప్రకాష్ రాజ్ ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తాను అనడం, అయితే, ఆ రాజీనామాను మంచు విష్ణు స్వీకరించను అని స్పష్టం చేయడం తెలిసిందే. అయితే, ఈ విషయం పై ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘డియర్ విష్ణు.. నేను నా రాజీనామాను వెనక్కి తీసుకోవాలి అంటే.. ఒక షరతు ఉంది. ‘తెలుగువాడు కాని వ్యక్తి మా ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని మీరు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘మా’ నియమ, నిబంధనలు మార్చాలి.
అలా మీరు మార్చకపోతే మా సభ్యత్వానికి నేను చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటాను. ఒకవేళ మారిస్తే, ఓటు వేయడానికో, గెలిపించడానికో నాకు ఇష్టం లేదు’’ అని ప్రకాశ్‌రాజ్ అన్నారు. ఇక శ్రీకాంత్ మాట్లాడుతూ ‘పదవులు లేకపోయినా అండగా ఉంటాం’ అంటూ చెప్పుకొచ్చారు. విభేదాలు తలెత్తకుండా ఉండటానికి మేము మాకి రాజీనామా చేస్తున్నాం’ అని తెలియజేశారు.
మొత్తానికి ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఎమోషనల్ గా స్పీచ్ ఇచ్చి… మోహన్ బాబు పై, మంచు విష్ణు పై ముఖ్యంగా నరేష్ పై అనేక విమర్శలు చేశారు. అనేక ఆరోపణలు చేశారు. మరి ఈ విమర్శల పై మోహన్ బాబు ఎలా గర్జిస్తాడో చూడాలి.