https://oktelugu.com/

Director Venu : నాని వద్దన్నాడు.. ఈ హీరో ఒడిసిపట్టాడు.. ఇంతకీ వేణు ‘ఎల్లమ్మ’లో ఏముంది?

దర్శకుడు వేణుతో నాని సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కాగా, క్రేజీ కాంబో సాకారం అవుతుందని ఆడియన్స్ భావించారు. అనూహ్యంగా నాని ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. హీరో కోసం వెతుకులాటలో ఉన్న వేణు-దిల్ రాజులకు ఓ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

Written By:
  • S Reddy
  • , Updated On : September 14, 2024 / 09:54 AM IST

    Director Venu Movie

    Follow us on

    Director Venu : కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో హీరో నాని ఎప్పుడూ ముందుంటారు. కొన్నాళ్లుగా ఆయన యంగ్ డైరెక్టర్స్ తో వరుస చిత్రాలు చేస్తున్నారు. రాహుల్ సంకీర్త్యన్, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, వివేక్ ఆత్రేయలతో నాని చిత్రాలు చేశారు. వాల్ పోస్టర్ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసిన కొత్త దర్శకులతో నాని చిత్రాలు నిర్మిస్తున్నారు. శైలేష్ కొలనుతో నాని నిర్మాతగా హిట్, హిట్ 2 చిత్రాలు నిర్మించారు. హిట్ సిరీస్లోలోని మూడవ భాగంలో నాని స్వయంగా నటిస్తున్నాడు. కథ నచ్చితే అవకాశం ఇస్తాడనే నమ్మకంతో బలగం వేణు నానికి ఒక కథ నెరేట్ చేశాడు.

    బలగం మూవీతో వేణు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఒక చిన్న కమెడియన్ దగ్గర ఇంత టాలెంట్ ఉందా అని ఇండస్ట్రీ విస్తుపోయింది. 2023కి గాను బలగం సంచలన చిత్రంగా నిలిచింది. నిర్మాతలకు భారీ లాభాలు పంచింది. బలగం సినిమాను తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో తెరలు వేసి బహిరంగంగా ప్రదర్శించారు. బలగం సినిమా చూసి విడిపోయిన కుటుంబాలు కలిశాయని వార్తలు వచ్చాయి. అంతగా ఆడియన్స్ ని ప్రభావితం చేసింది బలగం మూవీ. అనేక అవార్డులు, రివార్డులు ఈ చిత్రం అందుకుంది.

    తన రెండో చిత్రంగా బలగం వేణు ఎల్లమ్మ టైటిల్ తో స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఈ కథను హీరో నానికి వినిపించగా ఆయన ఇంప్రెస్ అయ్యాడు. ఫైనల్ స్క్రిప్ట్ తో రావాలని వేణుకు సూచించాడు. ఫైనల్ స్క్రిప్ట్ నానికి నచ్చలేదు. దాంతో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇదే కథను బలగం వేణు హీరో శర్వానంద్ కి చెప్పాడట. ఆయన ఫస్ట్ ఓకే చెప్పి, తర్వాత తప్పుకున్నాడట.

    ఫైనల్ గా ఎల్లమ్మ మూవీ చేసేందుకు నితిన్ ముందుకు వచ్చాడట. దిల్ రాజు నిర్మాతగా వేణు-నితిన్ కాంబోలో ఎల్లమ్మ రానుందని సమాచారం. ఈ క్రమంలో అసలు వేణు రాసుకున్న ఎల్లమ్మ మూవీ కథ ఏంటీ? అందులో ఏముంది? అనే ఆసక్తి అందరిలో కలుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా వేణు ఈ కథ రాసుకున్నాడట. ఎల్లమ్మ కోసం పోరాడిన దళిత యువకుడి కథే, ఎల్లమ్మ సినిమా అని సమాచారం.

    ఎల్లమ్మ హిందువుల ఆరాధ్య దైవం. కొన్ని ప్రాంతాల్లో ఆమెను ప్రత్యేకంగా పూజిస్తారు. జమదగ్ని భార్య అయిన రేణుక ఎల్లమ్మ భర్త ఆగ్రహానికి గురవుతుంది. దాంతో జమదగ్ని రేణుకా ఎల్లమ్మను శపిస్తాడు. ఎల్లమ్మ వికృత రూపంలో అడవుల్లో అష్టకష్టాలు పడుతుంది. ఓ ముని సూచన మేరకు పవిత్ర గంగా జలంలో మునిగి ఎల్లమ్మ శాప విముక్తురాలు అవుతుంది. తిరిగి భర్త జమదగ్ని ఆశ్రమానికి వెళుతుంది. ఆగ్రహించిన జమదగ్ని ఆమెకు ఆశ్రమ ప్రవేశం నిరాకరిస్తాడు.

    భర్త పాదాల వద్దే నా జీవితం అని ఎల్లమ్మ మొండికేస్తుంది . జమదగ్ని తన కొడుకులను పిలిచి తల్లి తల నరకాలని ఆదేశిస్తాడు. ఎవరూ ముందుకు రారు. పరశురాముడు మాత్రం తండ్రి ఆదేశం మేరకు తల్లిని సంహరిస్తాడు. పరశురాముడు నరికిన ఎల్లమ్మ తల వెళ్లి మాదిగలవాడలో పడుతుందట. అప్పటి నుండి మాదిగలు ఎల్లమ్మను దేవతగా కొలుస్తున్నారట. ఇతమిద్ధంగా ఎల్లమ్మ కథ ఇది.