Sukumar-Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్… ప్రస్తుతం ఆయన శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ పూర్తయిన నేపథ్యంలో బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయబోయే సినిమా మీదనే తను పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తనదైన రీతిలో నటించి మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన సుకుమార్ డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇక వీళ్లిద్దరూ కలిసి ఇప్పుడు చేయబోయే సినిమా ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుంది ఆ సినిమా బడ్జెట్ ఎంత అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.
ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని 1840 వ సంవత్సరపు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించడానికి సుకుమార్ సన్నహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో వీళ్ళ కాంబినేషన్ లో మరొక భారీ సక్సెస్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమాని చెక్కుతున్న సుకుమార్ ఈ సినిమాతో 1000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టాలని చూస్తున్నాడు.
ఇక దాంతో పాటుగా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో క్రేజ్ ను కూడా సంపాదించుకోవడానికి ఆయన ఆహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే పుష్ప సినిమా మంచి సక్సెస్ ని సాధించడంతో దానికి సీక్వెల్ గా పుష్ప 2 సినిమాను పట్టాలెక్కించారు. మరి ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకులందరిని ఎలా అలరించబోతుంది అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటికే ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సుకుమార్ చాలా బిజీగా ఉన్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాని ఒక భారీ సక్సెస్ గా నిలపడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇక అల్లు అర్జున్ కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్కువగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక గంగాలమ్మ జాతర ఫైట్ ని హైలెట్ చేస్తూ పుష్ప 2 సినిమా భారీ సక్సెస్ ని సాధించబోతుంది అంటూ ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో ఈ సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే క్రియేట్ అవుతుంది…