Hero Nithin : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న మీడియం రేంజ్ హీరోలలో ఒకరు నితిన్(Hero Nithin). దురదృష్టం ఏమిటంటే నితిన్ ని ఇంకా మీడియం రేంజ్ హీరో అని ట్రేడ్ పిలవడమే. కారణం మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు, టాలీవుడ్ రాజమౌళి(SS Rajamouli) నుండి త్రివిక్రమ్(Trivikram Srinivas) వరకు దాదాపుగా అందరి స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసిన నటుడు, అయినప్పటికీ మీడియం రేంజ్ హీరోగా మిగిలిపోవడం దురదృష్టమే. కెరీర్ లో ‘ఇష్క్’ చిత్రానికి ముందు డజనుకు పైగా ఫ్లాప్స్ ఉన్నాయి. కొన్ని సినిమాలు అయితే బిజినెస్ కాక ప్రసాద్ ల్యాబ్స్ లో ఏళ్ళ తరబడి మగ్గిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి స్థితి నుండి ఇష్క్ తో కంబ్యాక్ ఇచ్చి తన మార్కెట్ ని తిరిగి తెచ్చుకున్నాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా నితిన్ ఒక సూపర్ హిట్ కొడితే వరుసగా నాలుగైదు ఫ్లాపులు కొట్టడం అలవాటు అయిపోయింది.
Also Read : సల్మాన్ టైం బ్యాడ్ .. మళ్ళీ దొరికిపోయిన కండలవీరుడు! మేటర్ ఏంటంటే?
అందుకే అనుకున్న రేంజ్ కి వెళ్లలేకపోతున్నాడు. ‘భీష్మ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన చేసిన ‘చెక్’, ‘రంగ్ దే’, ‘మాచెర్ల నియోజకవర్గం’, ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ వంటి సినిమాలు చేసాడు. ఈ మూడు సినిమాలు కూడా ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో నిఖిల్ మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుముల తో ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) అనే చిత్రం చేసాడు. హిట్ కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా, పైగా పుష్ప 2 తర్వాత ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నుండి రాబోతున్న సినిమా, అంచనాలు భారీగా ఉండాలి. బిజినెస్ నితిన్ కెరీర్ లోనే హైయెస్ట్ గా జరగాలి. కానీ అలా జరగలేదు. ఈ నెల 28న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. కానీ ఈ సినిమాని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
అదే రోజున విడుదల కాబోతున్న ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి మాత్రం స్టార్ హీరో సినిమాకి ఉన్నంత బజ్ ఉంది. కానీ నితిన్ సినిమాని మాత్రం ఆడియన్స్ అసలు పట్టించుకోవడం లేదు. అందుకే ట్రేడ్ లో బిజినెస్ కూడా అంతంత మాత్రం గానే జరుగుతుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగింది అట. ఇది నితిన్ గత సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ అనే చెప్పొచ్చు. కొన్ని చోట్ల అయితే అవుట్ రైట్ బిజినెస్ చేయడానికి అసలు ఆసక్తి చూపడం లేదట. కేవలం అడ్వాన్స్ బేసిస్ మీద మాత్రమే చేస్తామని అంటున్నారట. ఇది మైత్రీ మూవీ మేకర్స్ కి ఊహించని షాక్ అనొచ్చు. కానీ మంచి సీజన్ లో విడుదల అవుతున్న సినిమా కాబట్టి, టాక్ వస్తే నితిన్ కం బ్యాక్ రికార్డు బ్రేకింగ్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు.