Sikandar Teaser: సల్మాన్ ఖాన్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆయన సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా జాన్ కిసీ కీ భాయ్, టైగర్ ౩ చిత్రాలు నిరాశపరిచాయి. గతంలో సల్మాన్ ఖాన్ కెరీర్ స్ట్రగుల్ లో ఉన్నప్పుడు సౌత్ రీమేక్స్ నిలబెట్టాయి. ఈ ఫార్ములా వర్క్ అవుట్ అవుతుందని వేదాళం రిమేక్ గా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీ చేశాడు. కానీ ఈసారి డిజాస్టర్ పండింది. తన రేంజ్ కి తగ్గ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సౌత్ డైరెక్టర్స్ నార్త్ లో సత్తా చాటుతున్న తరుణంలో సల్మాన్ ఖాన్.. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు.
Also Read: రామ్ చరణ్ హిట్ కొడితే ఎన్టీఆర్ బాధపడక తప్పదు.. లాజిక్ ఇదే!
సికందర్ టైటిల్ తో భారీ బడ్జెట్ తో సికందర్ రూపొందుతుంది. రంజాన్ కానుకగా మూవీ విడుదల చేసి బ్లాక్ బస్టర్ కొట్టడం సల్మాన్ ఖాన్ కి ఆనవాయితీగా ఉంది. 2025 రంజాన్ కి సికందర్ ధియేటర్స్ లోకి రానుంది. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 28న టీజర్ విడుదల చేశారు. నిమిషానికి పైగా ఉన్న టీజర్ రిచ్ విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ తో గ్రాండ్ గా ఉంది. సల్మాన్ ఖాన్ మాస్ మేనరిజం ఆకట్టుకుంది. అయితే టీజర్ లో కొత్తదనం లేదనే వాదన మొదలైంది. ఇది రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఆశించిన స్థాయిలో టీజర్ లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
దానికి తోడు ఇది కూడా రీమేక్ అంటున్నారు. విజయ్-మురుగదాస్ కాంబోలో గతంలో వచ్చిన సర్కార్ మూవీ సూపర్ హిట్. దాన్ని సికందర్ గా హిందీలో రీమేక్ చేశారంటూ కొందరు అంచనా వేస్తున్నారు. ఇక వరుస హిట్స్ తో జోరుమీదున్న రష్మిక మందాన టీజర్ లో హైలెట్ కాలేదు. ఆమె పాత్రకు సికందర్ మూవీలో ప్రాధాన్యత ఉండకపోవచ్చని అంటున్నారు. సికందర్ మూవీకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నారు. బీజీమ్ నిరాశ పరిచింది అనే అభిప్రాయం వినిపిస్తుంది.
Also Read: ‘హరి హర వీరమల్లు’ అధికారికంగా వాయిదా పడినట్టే..ఖరారు చేసిన నిర్మాత..మరి విడుదల అయ్యేది ఎప్పుడు?
అయితే దీనికి కారణం.. సల్మాన్ ఖాన్ దర్శకుడికి తగినంత సమయం ఇవ్వకపోవడమే అనే చర్చ మొదలైంది. ఎలాగైనా రంజాన్ బరిలో దించాలన్న పట్టుదలతో ఉన్న సల్మాన్ ఖాన్ ఒత్తిడి చేస్తున్నారని, హడావుడి కారణంగా క్వాలిటీ టీజర్ లో క్వాలిటీ తగ్గిందనే కోణం వినిపిస్తుంది. టాక్ కొంచెం అటూ ఇటూ ఉన్నా రంజాన్ కి విడుదల చేస్తే మెరుగైన వసూళ్ళు రాబట్ట వచ్చు అనేది సల్మాన్ ఖాన్ అంచనా. అలాగే రంజాన్ కి విడుదల చేస్తే హిట్ కొడతామనే సెంటిమెంట్ కూడా ఉంది. బాహుబలి ఫేం సత్యరాజ్ సికందర్ మూవీలో కీలక రోల్ చేస్తున్నారు.