Hero Nikhil : తండ్రైన హీరో నిఖిల్… ఇంతకీ అమ్మాయా? అబ్బాయా?

ప్రస్తుతం నిఖిల్ స్వయంభు టైటిల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. స్వయంభు పీరియాడిక్ వారియర్ యాక్షన్ డ్రామా. స్వయంభు చిత్రీకరణ జరుపుకుంటుంది

Written By: NARESH, Updated On : February 21, 2024 9:50 pm
Follow us on

Hero Nikhil : హీరో నిఖిల్ సిద్దార్థ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన తండ్రైన విషయం సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. నిఖిల్ భార్య పల్లవి పండంటి బిడ్డకు నేడు జన్మనిచ్చింది. నిఖిల్ 2020 మే 14న పల్లవి మెడలో తాళి కట్టాడు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన పల్లవిని నిఖిల్ ప్రేమించారు. పెళ్ళికి సమయం దగ్గర పడగా కోవిడ్ ఆంక్షలు మొదలయ్యాయి. నెలల తరబడి లాక్ డౌన్ కొనసాగడంతో నిఖిల్ చేసేది లేక.. కోవిడ్ ఆంక్షల మధ్య వివాహం చేసుకున్నాడు. ప్రభుత్వ సూచనల మేరకు అతికొద్ది మంది బంధు మిత్రులు వివాహానికి హాజరయ్యారు.

నిఖిల్ కి పెళ్ళై దాదాపు నాలుగేళ్లు అవుతుంది. పల్లవి గర్భం దాల్చిన విషయం నిఖిల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇటీవల ఘనంగా సీమంతం వేడుక నిర్వహించారు. కాగా నేడు బుధవారం పల్లవి అబ్బాయికి జన్మనిచ్చింది. దీంతో నిఖిల్ ఫ్యాన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తండ్రైన నిఖిల్ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు. గతంలో పల్లవి-నిఖిల్ విడిపోతున్నారంటూ పుకార్లు వినిపించాయి. ఈ కథనాలను నిఖిల్ పరోక్షంగా ఖండించారు.

ఇక నిఖిల్ కెరీర్ పరిశీలిస్తే జయాపజయాలతో సాగుతుంది. కార్తికేయ 2 తో ఆయన సాలిడ్ హిట్ కొట్టాడు. పాన్ ఇండియా స్థాయిలో కార్తికేయ 2 సత్తా చాటింది. భారీ వసూళ్లు రాబట్టింది. అనంతరం చేసిన 18 పేజెస్ పర్లేదు అనిపించింది. నిర్మాతలకు నష్టాలు మిగల్చకుండా బయటపడేసింది. స్పై మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. స్పై మూవీలో నిఖిల్ ఏజెంట్ రోల్ చేశాడు.

ప్రస్తుతం నిఖిల్ స్వయంభు టైటిల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. స్వయంభు పీరియాడిక్ వారియర్ యాక్షన్ డ్రామా. స్వయంభు చిత్రీకరణ జరుపుకుంటుంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. స్వయంభు మూవీలో నిఖిల్ కి జంటగా సంయుక్త మీనన్ నటిస్తుంది. సంగీతం రవి బసృర్ అందిస్తున్నారు. స్వయంభు చిత్రం కోసం నిఖిల్… చాలా కష్టపడుతున్నారు. యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. స్వయంభు మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.