హీరోగా క్లిక్ అయిన నాని.. ఇప్పుడు తనకు సూట్ కాని కథా బలం ఉన్న విలక్షణ చిత్రాలను నిర్మిస్తూ హిట్ కొడుతూ నిర్మాతగానూ సంపాదిస్తున్నాడు. అటు హీరోగా.. ఇటు నిర్మాతగా నాని రెండు చేతులా సినిమాలతోనే సంపాదించేస్తున్నాడు.
నేచురల్ స్టార్ నాని తన భార్య ప్రశాంతి తిప్పరనేనిని నిర్మాతగా మార్చి ఆమె సహకారంతో ‘వాల్ పోస్టర్’ సినిమా పతాకంపై కొన్ని మంచి కథా వస్తువు ఉన్న క్రియేటివ్ చిత్రాలను నిర్మించారు. ‘ఆ’, ‘హిట్’ లాంటి మూవీస్ తీసి నాని నిరూపించుకున్నాడు.
నాని ప్రొడక్షన్ హౌస్ నుంచి తాజాగా కొత్త సినిమా వస్తోంది. ‘మీట్ క్యూట్’ అనే ఈ సినిమా ఆసక్తికరంగా ప్రకటించారు. ఈరోజే షూటింగ్ ప్రారంభించబడింది.
దీప్తి ఘంటా ఈ చిత్రంతోనే టాలీవుడ్ లో దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇందులో ప్రముఖ నటీమణులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సీనియర్ నటుడు సత్యరాజ్ పై మొదటి షాట్ కోసం, నాని క్లాప్ కొట్టిన ఫొటోను విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వసంత కుమార్ కెమెరామెన్ గా చేస్తున్నాడు.
చిత్రం ఇతర తారాగణం.. సిబ్బంది త్వరలో ప్రకటించబడతారు. నాని క్లాప్ వెనుకాల ఉన్న హీరోయిన్ ఎవరన్నది మాత్రం రివీల్ చేయకపోవడం విశేషం.