Venky Atluri : సౌత్ లో గత పదేళ్ల నుండి సక్సెస్ కి ఆమడదూరంలో ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో సూర్య(Suriya Sivakumar) పేరు మొదటి వరుస లో ఉంటుంది. ఈయన చివరిసరిగా హిట్ కొట్టింది ఎప్పుడు అని అడిగితే అభిమానులు కూడా వెంటనే చెప్పలేరు, అన్ని సంవత్సరాలు అయ్యింది అన్నమాట. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కంగువా’ చిత్రం, ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘రెట్రో'(Retro Movie) చిత్రం కమర్షియల్ గా ఏ రేంజ్ డిజాస్టర్స్ గా నిల్చాయో మన కళ్లారా చూసాము. ఈ రెండు సినిమాల ఫలితాల పట్ల అభిమానులు తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు. ఇప్పుడు సూర్య తన ఆశలన్నీ తెలుగు సినిమా పైనే పెట్టుకున్నాడు. రీసెంట్ గానే ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో, వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వం లో ఒక సినిమా ఉంటుందని అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
Also Read : వెంకీ అట్లూరి కి ఎందుకు మన టాలీవుడ్ హీరోలు అవకాశం ఇవ్వడం లేదు?
ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. సూర్య తో పాటు ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తున్న మమిత బైజు(Mamitha Baiju) తో పాటు డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత సూర్య దేవర నాగవంశీ మరియు ఇతర టెక్నీషియన్స్ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మొదటి షాట్ కి క్లాప్ కొట్టాడు. వెంకీ అట్లూరి తో సూర్య సినిమా అనగానే పాజిటివ్ వైబ్రేషన్స్ మామూలుగా లేవని సోషల్ మీడియా లో సూర్య అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వెంకీ అట్లూరి ఇప్పటి వరకు ఇతర భాషలకు చెందిన హీరోలతో తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. తమిళ హీరో ధనుష్ తో ఆయన చేసిన సార్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
అదే విధంగా గత ఏడాది మలయాళం హీరో తో ఆయన చేసిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం కూడా సంచలన విజయం సాధించింది. థియేటర్స్ లో కంటే ఈ సినిమా ఓటీటీ లోనే పెద్ద హిట్ అయ్యింది అనుకోవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం దాదాపుగా 16 వారాల పాటు ట్రెండ్ అయ్యింది. దీంతో వెంకీ అట్లూరి మినిమం గ్యారంటీ చిత్రం సూర్య కి కూడా ఇస్తాడని అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు. మారుతి సుజుకి కారుని మన ఇండియా కి తీసుకొచ్చేందుకు కృషి చేసిన వ్యక్తి బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ముఖ్య పాత్ర, సీనియర్ హీరోయిన్ రాధికా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెలాఖరు నుండి ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
Also Read : తెలుగు హీరోలను పక్కన పెట్టేస్తున్న స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి! కారణం అదేనా?