Homeఎంటర్టైన్మెంట్Nani- Srikanth Odela :  క్రేజీ కాంబినేషన్ సెట్ చేసిన హీరో నాని..ఈసారి టార్గెట్ 500...

Nani- Srikanth Odela :  క్రేజీ కాంబినేషన్ సెట్ చేసిన హీరో నాని..ఈసారి టార్గెట్ 500 కోట్లు..ఫ్యాన్స్ కి పండగే!

'దసరా' కి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓడేలా మరోసారి నాని తో చేయడానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి దాదాపుగా 150 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ అవసరం అవుతుందట. అందుకు తగ్గట్టుగానే క్యాస్టింగ్ కూడా ఉంటుందని సమాచారం. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్ లో ఈ చిత్రం తెరకెక్కబోతుందట.

Nani- Srikanth Odela :  నేచురల్ స్టార్ నాని తన ప్రతీ సినిమాకి మార్కెట్ పరిధిని పెంచుకుంటూ పోతున్న సంగతి అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుండే ఆయన భిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ని సంపాదించుకున్నారు. కానీ ఆయన ఏర్పాటు చేసుకున్న లిమిటెడ్ మార్కెట్ నుండి మరో లెవెల్ కి వెళ్లే సినిమాలు ఆయన ‘దసరా’ చిత్రానికి ముందు చేయలేదు. ‘దసరా’ తో ఆయన మొట్టమొదటి సారి తన మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నం చేసాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నాని కి మొట్టమొదటి వంద కోట్ల రూపాయిల గ్రాస్ సినిమాగా నిల్చింది. ఈ చిత్రం తర్వాత నాని ఒక సెక్షన్ ఆడియన్స్ లో స్టార్ హీరో రేంజ్ ఇమేజి ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో నాని సినిమాకి వచ్చేంత వసూళ్లు చాలా మంది స్టార్ హీరోలకు కూడా రాలేదు అనే విషయం అందరికీ తెలిసిందే.

ఇక ‘దసరా’ తర్వాత ఆయన చేసిన ‘హాయ్ నాన్న’ చిత్రం కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇక రీసెంట్ గా ఆయన నుండి విడుదలైన ‘సరిపోదా శనివారం’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఆయన ‘దసరా’ చిత్రం తర్వాత వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఆయన తన మార్కెట్ ని ఏకంగా 5 రెట్లు పెంచుకునే రేంజ్ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నాడు. ‘దసరా’ కి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓడేలా మరోసారి నాని తో చేయడానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి దాదాపుగా 150 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ అవసరం అవుతుందట. అందుకు తగ్గట్టుగానే క్యాస్టింగ్ కూడా ఉంటుందని సమాచారం. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్ లో ఈ చిత్రం తెరకెక్కబోతుందట. ఈ సినిమాకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించనున్నాడు.

సినిమా ఎలా ఉన్నా అనిరుద్ తన అద్భుతమైన మ్యూజిక్ టాలెంట్ తో మరో లెవెల్ కి తీసుకెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే దర్శక నిర్మాతలు ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినా వెనకాడకుండా అనిరుద్ ని తమ సినిమాల కోసం తీసుకుంటున్నారు. రీసెంట్ గా ఆయన ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రానికి ఏ రేంజ్ మ్యూజిక్ అందించాడో మన అందరికీ తెలిసిందే. అద్భుతమైన పాటలతో పాటు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా దంచికొట్టేసాడు. ఫలితంగా ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. అలా మంచి ఫామ్ లో ఉన్న అనిరుద్ ని ఈ సినిమా కోసం తీసుకున్నారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై అంచనాలు పెరిగిపోయాయి, ఈసారి 100 , 200 కోట్లు కాదు, కొడితే 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలని అంటున్నారు నాని అభిమానులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper